మీటూ ఉద్యమం : హీరో అర్జున్‌కు కోర్టులో ఎదురుదెబ్బ... జైలు ఖాయమా..?

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (09:21 IST)
మీటూ ఉద్యమంలో భాగంగా, కన్నడ నటి శృతిహరిహరన్ చేసిన లైంగిక వేధింపుల కేసులో హీరో అర్జున్‌కు చుక్కెదురైంది. శృతి హరిహరన్‌పై అర్జున్ పెట్టిన కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని పోలీసులను కర్నాటక హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో శృతి హరిహరన్ పైచేయి సాధించినట్టయింది. 
 
ఉద్దేశపూర్వకంగానే తనపై శృతి హరిహరన్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిందని అర్జున్ ఆరోపించాడు. పైగా, వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలు శతవిధాలా ప్రయత్నించారు. కానీ, ఇవి ఫలించలేదు. 
 
ఈ నేపథ్యంలో తనను కావాలనే మీటూ వ్యవహారంలోకి లాగిందని ఆరోపిస్తూ శృతి హరిహరన్‌పై అర్జున్ పరువు నష్టం కేసు పెట్టాడు. దీంతో ఆమెపై ఎఫ్.ఐ.ఆర్ కూడా నమోదైంది. ఈ వ్యవహారంపై వాదనలు ఆలకించిన కోర్టు.. శృతి హరిహరన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆమెపై నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్‌ను రద్దు చేయాలని ఆదేశించింది. దీంతో అర్జున్‌పై శృతి పైచేయి సాధించినట్టు అయింది.
 
ఇకపోతే, అర్జున్‌పై శృతి హరిహరన్ పోలీస్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై అర్జున్‌ను పోలీసులు విచారణించారు కూడా. మరి ఈ వ్యవహారం ఎంతదూరం వెళ్తుందో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం