Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ "రాధేశ్యామ్" లేటెస్ట్ అప్‍డేట్స్ ఏంటి? 1000 మందితో 100 రోజులు...

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (14:59 IST)
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. సాహో తర్వాత పలు చిత్రాల్లో నటించేందుకు కమిట్ అయ్యారు. ఇలాంటి చిత్రాల్లో ఒకటి రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
 
ఇందులోభాగంగా, ఒక కీలకమైన భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తాజాగా హైదరాబాదులో చిత్రీకరించారు. నెల రోజుల పాటు జరిగిన షెడ్యూల్‌లో ప్రభాస్, ఫైటర్లు, ఇతర తారాగణంపై దీనిని భారీ ఎత్తున చిత్రీకరించడం జరిగింది.
 
దీనిపై దర్శకుడు స్పందిస్తూ, ''నా రెండేళ్ల స్వప్నాన్ని నెలరోజుల పాటు సాగిన యాక్షన్ షెడ్యూలులో సాకారం చేయడానికి 1000 మంది 100 రోజుల పాటు నిర్విరామంగా పనిచేశారు. ఈ సందర్భంగా.. గతంలో ఎన్నడూ చూడని ఈ అడ్వెంచర్‌ని ఆవిష్కరించిన మా యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్‌కి, అతని బృందానికి మా టీమ్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను' అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు.
 
ఇదిలావుంచితే, ఈ చిత్రానికి సంబంధించిన రెండు షెడ్యూళ్ల షూటింగును గతంలో జార్జియా, ఇటలీ దేశాలలో నిర్వహించిన సంగతి విదితమే. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా ఒకేసారి విడుదల చేస్తారు. ఇటీవల పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తోపాటు టైటిల్ థీమ్‌ను రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments