Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సిల్క్ స్మిత'గా నటించడం లేదు.. క్లారిటీ ఇచ్చిన అనసూయ

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (14:52 IST)
ఒకపుడు తెలుగు చిత్రపరిశ్రమను ఏలిన శృంగార తారామణుల్లో అగ్రస్థానం సిల్క్ స్మితకే దక్కుతుంది. ఈమె అనుమానాస్పదరీతిలో చనిపోయింది. ఈమె మృతి ఇప్పటికే ఓ మిస్టరీనే. అలాంటి సిల్క్ స్మిత జీవిత చరిత్రను వెండితెర దృశ్యకావ్యంగా తెరకెక్కనుందనే ప్రచారం జోరుగా సాగింది. ఈ చిత్రంలో సిల్క్ స్మితగా బుల్లితెర ప్రముఖ నటి, యాంకర్ అనసూయ నటిస్తుదనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే, అందులో నిజం లేదని అనసూయ తేల్చి చెప్పింది. అయితే, ఇలాంటి వార్తలు రావడానికి ఆమె ఇటీవల చేసిన పోస్టులే కారణం.
 
హీరో విజయ్‌ సేతుపతితో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నట్లు ఇటీవల అనసూయ ఫొటో పోస్ట్ చేసింది. ‘మరో మంచి కథలో జీవిస్తున్నాను. కొత్త ప్రయాణం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో అనసూయ పేర్కొంది. తన ఈ కొత్త లుక్‌కు సిల్క్ స్మిత రిఫరెన్స్ అని చెప్పింది.
 
అంతేగాక, లిప్ స్టిక్ పెదాలు, చేతులకి గాజులు, చీరకట్టుతో అద్దంలో తన ముఖం కనపడేట్లు ఆమె మరో ఫొటో పోస్ట్ చేసింది. ఈ రోజు మరో ఫొటో పోస్ట్ చేసి, మరింత ఆసక్తిని రేపింది. ఇదే సమయంలో సిల్క్ స్మిత బయోపిక్ రూపొందుతోందని ప్రచారం జరుగుతుండడం, ఇదేసమయంలో అచ్చం ఆమెలా తయారై అనసూయ పోస్టు చేయడంతో ఆ పాత్రలో అనసూయే నటిస్తోందని వార్తలు వచ్చాయి. 
 
దీంతో తాజాగా ఆమె స్పందించింది. ‘నేను ఏ బయోపిక్‌లోనూ సిల్క్ స్మిత గారి పాత్రలో నటించడం లేదు’ అని ఆమె స్పష్టం చేసింది. దీంతో తనపై వస్తున్న ఊహాగానాలకు సిల్క్ స్మిత తెరదించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

వీళ్లేమో వీధి కుక్కల్ని చంపొద్దంటారు, అవేమో ప్రజల పిక్కల్ని పీకుతున్నాయి

ఆపరేషన్ సిందూరు సమయంలో పాక్ నౌకలు మాయం

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments