Webdunia - Bharat's app for daily news and videos

Install App

"వాల్తేరు వీరయ్య" బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయం : రవితేజ కాన్ఫిడెంట్

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (19:52 IST)
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'వాల్తేరు వీరయ్య' అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానరుపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించారు. 
 
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్‌‌తో పాటు ఇద్దరూ కలసి అలరించిన పూనకాలు లోడింగ్ పాటకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన అల్బమ్‌లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్  బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. 
 
ఇక తాజాగా విడుదలైన వాల్తేరు వీరయ్య ట్రైలర్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'వాల్తేరు వీరయ్య' జనవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలౌతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ వైజాగ్‌లో మెగామాస్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని మాసీవ్‌గా నిర్వహించింది. భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానుల సమక్షంలో మాస్ జాతరలా జరిగిన మెగామాస్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
 
ఈ వేడుకలో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య నటీనటులకు, సాంకేతిక నిపుణలందరికీ ఆల్ ది బెస్ట్ కాదు.. కంగ్రాట్స్. ఎందుకంటే సినిమా బ్లాక్ బస్టర్. పూనకాలు లోడింగ్. చిరంజీవితో నా జర్నీ మొదలైయింది విజయవాడ నుండి. విజేత వేడుక విజయవాడలో జరిగినప్పుడు.. చిరంజీవిగారిని చాలా దూరం నుండి చూశాను. అప్పుడే మా ఫ్రండ్స్‌తో ఏదో ఒక రోజు .. ఆయన పక్కన కూర్చుంటానని చెప్పాను. 
 
అక్కడ నుండి మొదలైతే మొదట ఫ్రండ్ క్యారెక్టర్, తర్వాత తమ్ముడి క్యారెక్టర్.. ఇప్పుడు వాల్తేరు వీరయ్య. చిరంజీవితో వున్న ప్రతి మూమెంట్ చాలా గర్వంగా వుంటుంది. ఆయన నన్ను ఎంతో ఇష్టపడతారు ప్రేమిస్తారు. అన్నయ్య ఎవరేమన్నా భరిస్తారు.. బాధపడతారేమో కానీ బయటపడరు. ఆయనలో వున్న గొప్ప లక్షణం అది. ఆయన ఎప్పుడూ ఎవరి గురించి నెగిటివ్‌గా మాట్లాడలేదు. బాబీ బలుపు సమయంలో పరిచయమయ్యాడు. పవర్ తీశాడు. వీరయ్యతో నెక్స్ట్ లెవల్‌కి వెళ్తాడని నా గట్టి నమ్మకం. దేవిశ్రీ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. సక్సెస్ మీట్‌లో మళ్ళీ కలుద్దాం’’ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments