Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణికర్ణిక ఫస్ట్ లుక్ ఇదే.. ఝాన్సీగా కంగనా.. వీపున బిడ్డతో..

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని.. పలు సినిమాల ఫస్టు లుక్స్ విడుదలయ్యాయి. దీంతో సినీ ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు. ఆగస్టు 15న ఎన్టీఆర్ అరవింద సమేత ట్రైలర్, రవితేజ అమిర్ అక్బర్ ఆంటోనీ ఫస్ట

Webdunia
బుధవారం, 15 ఆగస్టు 2018 (14:37 IST)
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని.. పలు సినిమాల ఫస్టు లుక్స్ విడుదలయ్యాయి. దీంతో సినీ ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు. ఆగస్టు 15న ఎన్టీఆర్ అరవింద సమేత ట్రైలర్, రవితేజ అమిర్ అక్బర్ ఆంటోనీ ఫస్ట్ లుక్, వరుణ్ తేజ్ అంతరిక్షం ఫస్ట్ లుక్స్ విడుదలయ్యాయి. ఈ సినిమాలతో పాటు క్రిష్ దర్శకత్వం వహించే మణికర్ణిక సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. 
 
మణికర్ణిక ఫస్ట్ లుక్‌లో వీరనారి ఝన్సీ లక్ష్మీబాయిగా కంగనా ఆహార్యం సూపర్‌గా వుంది. వీపుపై చిన్న బిడ్డతో యుద్ధరంగంలో దూసుకెళ్తున్న కంగనా లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీని కమల్ జైన్‌తో కలిసి జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్ చేస్తున్నారు.
 
గౌతమిపుత్ర శాతకర్ణి వంటి చారిత్రక సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు క్రిష్, తాజాగా కంగనా ప్రధాన పాత్రధారిగా  ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్రను మణికర్ణికగా రూపొందిస్తున్నాడు. ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టినప్పటి పేరు మణికర్ణికను ఈ మూవీ టైటిల్‌గా ఫిక్స్ చేసారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ మూవీకి కథా సహకారం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Secunderabad: సికింద్రాబాద్‌లో 45కిలోల గంజాయిని స్వాధీనం

పశువులా చూశారు.. ఆహారం, నీరు లేదు.. హనీమూన్‌కు వెళ్లి తిరిగొస్తుంటే...?

పాకిస్తాన్ గడ్డపై అజార్ వున్నాడని తెలిస్తే అతనిని అరెస్ట్ చేస్తాం: బిలావల్ భుట్టో

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments