Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షాకింగ్... 'కంచె' హీరోయిన్ ప్రగ్యాతో క్రిష్ లింక్? పెళ్లైన రెండేళ్లలోపే భార్య రమ్యకు విడాకులు...(Video)

సినిమా ఇండస్ట్రీ అంటే వైవాహిక జీవితాల్లో ఒడిదుడుకులు ఉంటుంటాయని చెప్పుకుంటుంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన ఓ వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే... ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడు క్రిష్ పెళ్లయి

Advertiesment
షాకింగ్... 'కంచె' హీరోయిన్ ప్రగ్యాతో క్రిష్ లింక్? పెళ్లైన రెండేళ్లలోపే భార్య రమ్యకు విడాకులు...(Video)
, శుక్రవారం, 1 జూన్ 2018 (12:53 IST)
సినిమా ఇండస్ట్రీ అంటే వైవాహిక జీవితాల్లో ఒడిదుడుకులు ఉంటుంటాయని చెప్పుకుంటుంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన ఓ వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే... ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడు క్రిష్ పెళ్లయిన రెండేళ్ల లోపుగానే తన భార్య రమ్యకు విడాకులు ఇవ్వబోతున్నారన్నది. క్రిష్ విడాకులు ఇవ్వడానికి కారణం నటి ప్రగ్యా జైస్వాల్ అని తెలుస్తోంది. 
 
క్రిష్ 2016, ఆగస్టు 7న 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి మరీ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. ఐతే ఇటీవల క్రిష్ ప్రవర్తనపై భార్య రమ్య ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కంగనా రనౌత్ హీరోయిన్‌గా తీస్తున్న మణికర్ణిక చిత్రం కోసం ముంబైలో మకాం వేసిన క్రిష్, ప్రగ్యాతో డేటింగ్ చేస్తున్నట్లు ఆమెకు అనుమానం వచ్చిందట. దీనిపై క్రిష్‌ను ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాదనలు చెలరేగి అది విడాకులకు దారి తీసినట్లు చెప్పుకుంటున్నారు. దీనితో ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు సినీజోష్ వెబ్ సైట్ తెలిపింది. మరి ఇందులో వాస్తవం ఎంతో తేలాల్సి వుంది. కంచె చిత్రం ద్వారా ప్రగ్యాను క్రిష్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. వీడియో చూడండి,

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డేటింగ్ వరకు వెళ్లలేదు.. డిన్నర్ వద్దే ఉన్నాం.. నిధి అగర్వాల్