గోరక్షణ పేరుతో దాడులా? ఇడియట్సే ఆ పని చేస్తారు : కంగనా రనౌత్

జంతువుల పేరుతో దాడులు జరిపేవారిని ఇడియట్స్ కిందే పరిగణిస్తారని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ అభిప్రాయపడింది. ఆమె సద్గురు జగ్గీవాసుదేవ్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ, 'జంతువులను రక్షించడం మ

శుక్రవారం, 10 ఆగస్టు 2018 (09:41 IST)
జంతువుల పేరుతో దాడులు జరిపేవారిని ఇడియట్స్ కిందే పరిగణిస్తారని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ అభిప్రాయపడింది. ఆమె సద్గురు జగ్గీవాసుదేవ్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ, 'జంతువులను రక్షించడం ముఖ్యమే. కానీ, వాటిని కాపాడే క్రమంలో తెలివితక్కువగా ప్రవర్తించకూడదు. గోరక్షణ పేరుతో దాడులు చేయడం చాలా తప్పు. ఇడియట్లే అలా ప్రవర్తిస్తారు' అని వ్యాఖ్యానించారు.
 
'ఇలాంటి ఘటనల గురించి విన్నప్పుడు గుండె తరుక్కు పోతోంది. ఇది తప్పని అందరూ తెలుసుకోవాలి. ఝాన్సీ లక్ష్మీబాయి కూడా లేగదూడలను ఎంతో జాగ్రత్తగా కాపాడేవారు. గోవులను కాపాడే ముందు విలువలని కాపాడాలి. జంతువులను కాపాడుకోవాలనుకోవడం మంచిదే. కానీ, ఆ కారణంతో మనుషులపై దాడి చేయడంలో అర్థం లేదు' అని ఆమె వ్యాఖ్యానించారు. 
 
కాగా, గో సంరక్షణ పేరుతో ఇటీవల దేశవ్యాప్తంగా దాడులు పెచ్చుమీరుతున్న విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని అల్వార్‌, హరియాణ రాష్ట్రాల్లో కొద్ది రోజుల క్రితం ఇద్దరు యువకులపై దాడి చేసి హత్య చేసిన ఉదంతాలే ఇందుకు ఉదాహరణ. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం జీవిత భర్త డాక్టర్ రాజశేఖర్‌కు 'తార'తో అక్రమ సంబధమా?