Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌ల‌స కార్మికులను స్వ‌స్థ‌లాల‌కు పంపిస్తున్న హీరో మంచు మనోజ్

Webdunia
బుధవారం, 20 మే 2020 (21:14 IST)
మే 20 త‌న బ‌ర్త్‌డేను పుర‌స్క‌రించుకొని హీరో మ‌నోజ్ మంచు ఒక సామాజిక కార్య‌క్ర‌మాన్ని త‌ల‌పెట్టారు. కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధంలో భాగంగా ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ విధించ‌డంతో ఎక్క‌డి వ‌ల‌స కార్మికులు అక్క‌డే ఆగిపోయారు. ఉపాధి లేక‌, స్వ‌స్థ‌లాల‌కు చేరుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అలాంటి వారిని ఆదుకోవ‌డానికి మ‌నోజ్ ముందుకు వ‌చ్చారు. 
దేశంలోని వివిధ ప్రాంతాల‌కు చెందిన ప‌లువురు వ‌ల‌స కార్మికులు హైద‌రాబాద్‌లో ఉంటూ ఇబ్బందులు ప‌డుతున్న విష‌యం ఆయ‌న దృష్టికి రావ‌డంతో, వాళ్ల‌ను సొంత ఊళ్ల‌కు త‌ర‌లించే బాధ్య‌త‌ను భుజాన వేసుకున్నారు. బుధ‌వారం హైద‌రాబాద్‌లోని మూసాపేట నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన ప‌లువురిని రెండు బ‌స్సుల్లో వారి స్వ‌స్థ‌లాల‌కు పంపించారు. 
వాళ్ల‌కు అవ‌స‌ర‌మైన ఆహారంతో పాటు మాస్క్‌లు, శానిటైజ‌ర్స్‌ను కూడా ఆయ‌న‌ అంద‌జేశారు. ఆ కార్మికులు త‌మ ఇళ్ల‌కు చేరేంత‌వ‌ర‌కు మార్గ‌మ‌ధ్యంలో అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాల‌ను మ‌నోజ్ టీమ్‌ క‌ల్పిస్తున్నారు. ఇదే విధంగా గురువారం నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాల‌కు చెందిన‌ వ‌ల‌స కార్మికుల‌ను హైద‌రాబాద్ నుంచి వారి ఊళ్ల‌కు బ‌స్సుల్లో పంపేందుకు మ‌నోజ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments