Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఇండస్ట్రీ 'మెగా' మీటింగ్‌కు సన్నాహాలు : చిరు చర్యలు?

Webdunia
బుధవారం, 20 మే 2020 (20:54 IST)
కరోనా వైరస్ దెబ్బకు ఇతర రంగాలు ఏవిధంగా కుదేలయ్యాయో... అంతకంటే ఎక్కువగా సినీ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. వందల కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన అనేక కొత్త ప్రాజెక్టులు అర్థాంతరంగా ఆగిపోయాయి. లాక్డౌన్ పుణ్యమాని సినీ రంగానికి చెందిన 24 క్రాఫ్ట్‌ల కళాకారులు తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. ముఖ్యంగా, సినిమా థియేటర్స్ పూర్తిగా మూతపడ్డాయి. ఇవి మరో ఆర్నెల్ల వరకు తెరుచుకునే పరిస్థితి లేదు. 
 
ఈ పరిస్థితుల్లో కేంద్రంతో పాటు.. పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తున్నాయి. ఈ త‌రుణంలో చిత్ర ప‌రిశ్ర‌మ కోలుకునేలా షూటింగ్స్ ఎలా ప్రారంభించాలి? థియేట‌ర్స్ విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాలి? అనే విష‌యాల‌పై గురువారం మెగాస్టార్ చిరంజీవి సినీ ప్ర‌ముఖుల‌తో మీటింగ్ ఏర్పాటు చేశార‌ని సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి‌. మరి ఇందులో నిజా నిజాలెంత? ఈ మీటింగ్ త‌ర్వాత రాజ‌కీయ ప్ర‌ముఖుల‌నెవ‌రినైనా సినీ పెద్ద‌లు క‌లుస్తారేమో? చూడాలి. 
 
మరోవైపు, కరోనా లాక్డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన సినీ ఇండస్ట్రీని ప్రభుత్వాలు ఆదుకోవాలని సినీ నిర్మాతలు, ప్రముఖులు ఇప్పటికే కోరుతున్నారు. అంతేకాకుండా, హీరోలు, హీరోయిన్లు, ఇతర నటీనటులు తమ రెమ్యునరేషన్ కూడా తగ్గించుకోవాలని సినీ నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఒక్కరూ కలిసి సినీ రంగాన్ని తిరిగి పట్టాలెక్కించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందులోభాగంగా, మెగా మీటింగ్‌కు చిరంజీవి ఏర్పాట్లు చేసినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకోండి.. బీఆర్ నాయుడికి హరీశ్ వినతి (Video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు, ఎందుకో తెలుసా?

అమెరికా నుంచి భారతీయులను ప్రత్యేక విమానాలలో ఎందుకు తిప్పి పంపుతున్నారు, ట్రంప్ వచ్చాక ఏం జరగనుంది?

నిరూపిస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాం : చెవిరెడ్డికి బాలినేని సవాల్

బంగాళాఖాతంలో మరింతగా బలపడిన వాయుగుండం.. దిశ మారుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments