Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మోహన్ బాబు కూతురైతే ఏంటి?" అంటారు.. ఏం చేద్దాం: మంచు లక్ష్మి

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (12:34 IST)
రాష్ట్రంలోని సినిమా థియేటర్లన్నీ కొంతమంది చేతుల్లో ఉంచుకుని ఇండస్ట్రీని శాసిస్తున్నరాని చాలాకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. తమకు సంబంధించిన సినిమాలను మాత్రమే ఎక్కువ రోజుల పాటు థియేటర్లలో ఉంచుతూ, మిగిలినవాటిని తీసేయడం వలన చిన్న సినిమాలకు హిట్ టాక్ వచ్చినప్పటికీ మంచి వసూళ్లు సాధించలేకపోతున్నాయి. ఇక సెలవులు, పండుగల సమయంలో అయితే ఈ పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. 
 
ఇటీవల మంచు లక్ష్మి నటిస్తూ నిర్మిస్తున్న 'మిసెస్ సుబ్బలక్ష్మి' అనే వెబ్ సిరీస్‌ను లాంచ్ చేసే వేడుకకు హాజరైన మంచు లక్ష్మి ఈ విషయంగా మాట్లాడారు. అస్సలు ఇప్పుడు సినిమాలు తీయాలంటేనే భయంగా ఉంది. నిర్మాతగా సినిమా తీసేటప్పుడు బాగానే ఉంది, కానీ దాన్ని విడుదల చేసే ప్రక్రియలో అనేక కష్టాలు పడాల్సి వస్తోంది. థియేటర్లన్నీ ఆనలుగురి చెప్పు చేతల్లో ఉండటంతో విడుదల చేయడానికి థియేటర్లు దొరక్క ఇబ్బందుల పాలు కావలసి వస్తోంది. 
 
ఒక సినిమా తీయాలంటే సుమారు సంవత్సరం రోజుల పాటు టెక్నీషియన్లందరూ కష్టపడాలి. అంత కష్టపడిన తీసిన సినిమాను థియేటర్‌లో విడుదల చేస్తే మరో సినిమా విడుదలవుతోందని తీసేయడం చాలా బాధగా ఉంది. ఈ విషయంలో చిన్న, పెద్ద చూడరు. మోహన్ బాబు కూతురైతే ఏంటి అన్నట్లు ఉంటుంది పరిస్థితి. వెబ్ సిరీస్‌లలో అయితే ప్రయోగాలు చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అందుకే ఇది మంచి ప్లాట్‌ఫారమ్, భవిష్యత్తులో వీటి హవా నడుస్తుందని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments