Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవును.. గంగూలీతో ఆ రిలేషన్‌షిప్ నిజమే.. నగ్మా కామెంట్స్ (video)

Advertiesment
అవును.. గంగూలీతో ఆ రిలేషన్‌షిప్ నిజమే.. నగ్మా కామెంట్స్ (video)
, గురువారం, 7 మార్చి 2019 (11:47 IST)
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలను షేక్ చేసిన నటి నగ్మా. 90టీస్‌లో తన గ్లామర్‌తో బాక్సాఫీసును షేక్ చేసిన ఈ భామ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్‌ లైఫ్‌ను కొనసాగిస్తోంది. ఈమె చెల్లెళ్లు, జ్యోతిక, రోషిణిలు కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్న నేపథ్యంలో.. పెళ్లి గురించి నగ్మా ఓ మాట చెప్పింది. అలనాటి నటి, కాంగ్రెస్ నాయకురాలు నగ్మా తాను పెళ్లికి వ్యతిరేకం కాదని చెప్పింది. 
 
దేవుడు ఎలా రాసిపెడితే అలా జరుగుతుందని చెప్పింది. ఎవరికైనా లైఫ్‌లో పెళ్లి ఎప్పుడు జరగాలి? అసలు ఆ యోగం ఉంటుందా? ఉండదా? అనే విషయాల మీద దేవుడు ముందే రాసిపెడతాడని తెలిపింది. తన పెళ్లి గురించి నిర్ణయించుకోవాల్సిన అవసరం ఏముందంటూ సమాధానమిచ్చింది. సరైన వ్యక్తి తారసపడితే కచ్చితంగా నాలుగు పదుల వయస్సులోనైనా పెళ్లి చేసుకుంటానని మనసులోని మాట బయటపెట్టింది.
 
అంతటితో ఆగకుండా.. ప్రస్తుతానికైతే తన లైఫ్‌లో ఎవరూ లేరని నగ్మా చెప్పింది. ఇంకా క్రికెట్ మాజీ గంగూలీతో రిలేషన్‌షిప్ నిజమేనని చెప్పడంతో చర్చ మొదలైంది. ఒకానొక దశలో తామిద్దరం మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించామని, కెరీర్ కోసం గంగూలీ రిలేషన్ షిప్‌కు ముగింపు పలికాడని తెలిపింది. మరి నగ్మా వ్యాఖ్యలపై గంగూలీ ఏమంటాడో వేచి చూడాలి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లక్ష్మీస్ ఎన్టీఆర్ 'అవసరం' రిలీజ్ (Video)