Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకున్నాక వెంటనే పిల్లల్ని కనేయండి.. రానాకు నటి సలహా

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (22:51 IST)
టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరోల్లో ఒకరైనా రానా దగ్గుబాటి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన ప్రేమించిన మిహీకా బజాజ్‌తో వచ్చే డిసెంబరు నెలలో వివాహం జరుగనున్నట్టు సమాచారం. ఈ ప్రేమికులకు ఇరు కుటుంబాల పెద్దల అనుమతితో ఒక్కటి కాబోతున్నారు. వీరి నిశ్చితార్థం, రోకా వేడుక కూడా బుధవారం రాత్రి జరిగింది. 
 
అయితే, రోకా వేడుక తర్వాత రానాతో మంచు లక్ష్మి ముచ్చటించింది. అలాగే, రానా - మిహీకాల రోకా వేడుక తర్వాత రానాతో తనకున్న కొన్ని మధుర స్మృతులను వెల్లడించింది. అంతేకాకుండా, రానా - మిహీకా దంపతులకు ఓ సలహా కూడా ఇచ్చేసింది. వివాహం చేసుకున్న వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిల్లల్ని కనేయాలంటూ సూచన చేసింది. 
 
మరోవైపు, తనకు కాబోయే భార్య మిహీకా గురించి బాహుబలి విలన్ రానా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తన పెద్ద చెల్లెలు అశ్రితకు మిహీకా క్లాస్ మేట్ అని రానా చెప్పాడు. మిహీకా తనకు ఎప్పటి నుంచో తెలుసని... అయితే లాక్డౌన్‌కు కొన్ని రోజుల ముందే తమ మధ్య ప్రేమ పుట్టిందన్నారు. 
 
ముంబైలో మిహీకాకు ఉన్న ఫ్రెండ్స్ తనకు కూడా స్నేహితులు కావడం... తమ మధ్య బంధం బలపడటానికి మరో కారణమన్నాడు. మిహీకా నార్త్ ఇండియన్ అని... అయితే చిన్నప్పటి నుంచి హైదరాబాదులోనే పెరిగిందని... జూబ్లీహిల్స్‌లో వారి ఇల్లు ఉందని రానా తెలిపాడు. 
 
తాను ప్రేమిస్తున్నాననే విషయాన్ని ఫోన్ ద్వారా మిహీకాకు చెప్పానని... ఆ తర్వాత ఆమె తనను కలిసిందని... పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. తనకు పెళ్లి చేయాలని ఇంట్లో ఎప్పటి నుంచో అనుకుంటున్నారని... మిహీకా విషయం చెప్పగానే అందరూ సంతోషపడ్డారని తెలిపారు. ఇప్పుడు జరిగింది రోహా వేడుక అని... ఇది నార్త్ ఇండియన్స్ చేసుకుంటారని... త్వరలోనే తాము ఉంగరాలు మార్చుకుని, నిశ్చితార్థం చేసుకుంటామని రానా వివరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలితో సహజీవనం, పెళ్లి మాటెత్తేసరికి చంపి ఫ్రిడ్జిలో పెట్టేసాడు

Roja: వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఆర్కే రోజా ప్రశ్న

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటానంటూ భర్తకు సవాల్, మనస్తాపంతో భర్త ఆత్మహత్య

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments