Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోటల్ గదిలో అనుమానాస్పదంగా మలయాళ నటుడు మృతి

Webdunia
ఆదివారం, 19 నవంబరు 2023 (12:28 IST)
కేరళ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ఆ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ నటుడు హోటల్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించాడు. కొట్టాయం జిల్లాలోని ఓ హోటల్ సమీపంలో ఈ ఘటన జరిరగింది. పార్క్ చేసివున్న కారులో ఆయన విగతజీవిగా కనిపించాడు. ఈ విషయాన్ని గమనించిన హోటల్ సిబ్బంది పోలీసలకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని కారు డోర్లు ఓపెన్ చేసి నటుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుడిని వినోద్ థామస్‌గా గుర్తించారు. 
 
కారులో విగతజీవిగా పడివున్న ఆయనను గుర్తించిన వెంటనే పోలీసులు ఆస్పత్రికి తరలించాం. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. వినోద్ మరణానికి గల కారణాలు తెలియాల్సివుంది. కారులో ఏసీలోని విషపూరిత వాయువు పీల్చడంతో ఆయన మరణించివుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, పోస్టుమార్టం తర్వాతే వినోద్ మరణానికి గల కారణం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. కాగా, వినోద్ థామస్ మలయాళంలో 'హ్యాపీ వెడ్డింగ్', 'జూన్' వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Viral Post from NTR Trust: ఆరోగ్య సమస్యలను తగ్గించే ఆహార పదార్థాల జాబితా

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ ప్రియుడుని 20 సార్లు కత్తితో పొడిచిన భర్త!!

స్వర్ణదేవాలయంలో మంత్రి నారా లోకేశ్ దంపతుల ప్రార్థనలు

అమెరికాలో మిస్సైన తెలుగు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. కారణం అదే?

మరో వ్యక్తితో చాటింగ్.. తల్లీకూతురుని హత్య చేసిన కిరాతకుడు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments