Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్ లేకుంటే నగ్నంగా ఉన్నట్టుగా ఉంటుంది : మాళవికా మోహనన్

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (18:57 IST)
మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన హీరోయిన్లలో మాళవికా మోహనన్ ఒకరు. పేట, మాస్టర్ వంటి చిత్రాల ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. అదేసమయంలో ఈ అమ్మడు ఎక్స్‌పోజింగ్ చేయడంలోనూ ఏమాత్రం తీసిపోవడం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఈమె అందాలను ఆరబోస్తూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇపుడు ఆసక్తికరంగా మారాయి.
 
కరోనా వైరస్ మహమ్మారి కారణం ఇపుడు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొద‌ట్లో మాస్క్ అల‌వాటు చేసుకోవ‌డంలో నిర్ల‌క్ష్యం వ‌హించినా.. రాను రాను దాదాపు అంద‌రూ విధిగా మాస్క్ పెట్టుకుంటున్నారు. గత ఏడాది కాలంగా జ‌నాలు బ‌య‌ట‌కు వెళ్లారంటే మాస్క్ పెట్టుకునే వెళ్తున్నారు.
 
ప్రస్తుతం జీవితంలో ఓ భాగ‌మైపోయిన‌ మాస్క్ లేకుంటే న‌గ్నంగా ఉన్నామ‌నే భావ‌న క‌లుగుతోంద‌ని మాళవిక మోహ‌న‌న్ అంటోంది. ప్ర‌స్తుతం ధనుష్ హీరోగా నటిస్తున్న 'మార‌న్' సినిమా షూటింగు కోసం ఆమె హైద‌రాబాద్ నగరంలో ఉంటున్నారు. ఈ భామ మీడియాతో చేసిన చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. షూటింగ్ చేస్తున్న‌పుడు సెట్స్‌లో క‌ఠిన భ‌ద్ర‌తా నియ‌మాలు అమ‌లు చేస్తున్నారు. 
 
కానీ యాక్ట‌ర్లుగా మేం మాస్క్ తీయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతుంది. నేను చాలా కాలంగా మాస్క్ ధ‌రించ‌డం అల‌వాటు చేసుకున్నా. కానీ ఒక్క‌సారిగా మాస్క్ లేకుండా ఉండాల్సి వ‌స్తే న‌గ్నంగా ఉన్న భావ‌న క‌లుగుతోంది. మీ డ్రెస్సింగ్‌లో ముఖ్యమైన వ‌స్తువుగా మారిపోయిన మాస్క్‌ను తీసేయాల్సి వ‌స్తే క‌ష్టంగా అనిపిస్తుందంటూ చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంగవ్వ మేకోవర్ మామూలుగా లేదుగా... సోషల్ మీడియాలో వైరల్!!

వృద్ధురాలి మెడకు చీర బిగించి చంపిన బాలుడు.. ఆపై మృతదేహంపై డ్యాన్స్ చేస్తూ పైశాచికానందం...

మే 15 నుంచి మే 26 వరకు సరస్వతి పుష్కరాలు.. అన్నీ ఏర్పాట్లు

తమ్ముడు చోరీ చేశాడనీ అవమానభారంతో ఇద్దరు పిల్లలతో బావిలో దూకిన అక్క!!

వెంటిలేటరుపై చికిత్స పొందుతున్నా వదలిపెట్టని కామాంధులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments