Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎట్టకేలకు ముఖానికి మాస్క్ ధరించిన ఏపీ సీఎం జగన్

Advertiesment
ఎట్టకేలకు ముఖానికి మాస్క్ ధరించిన ఏపీ సీఎం జగన్
, సోమవారం, 19 జులై 2021 (17:10 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో ఎట్టకేలకు మార్పువచ్చింది. కరోనా నిబంధనల్లో భాగంగా, ఆయన ముఖానికి మాస్క్ ధరించారు. కరోనా వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరూ మాస్క్‌ను విధిగా ధరించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. మాస్క్ ధరించని వారి నుంచి రూ.100 అపరాధం వసూలు చేయాలని కూడా ఆదేశించింది. అయితే, ముఖ్యమంత్రి పాల్గొనే సమావేశాల్లో మాస్క్ ధరించడం లేదు. ఇదే అంశంపై మీడియాల వార్తలు వచ్చాయి. పలు మార్లు మాస్కు లేకుండానే కనిపించి విమర్శల పాలయ్యారు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం ఆయన పోలవరం పర్యటనకు వళ్లారు. ఆ సమయంలో ఆయన ముఖానికి మాస్క్ ధరించారు. కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న సమయంలో కూడా ఆయన మాస్క్ ధరించలేదు. అసెంబ్లీ సమావేశాలు, రాష్ట్ర అభివృద్ధిపై అధికారులతో సమీక్షలు, పత్రికాసమావేశాలు, బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నప్పుడు మాస్క్ ధరించలేదు. 
 
నీతులు, నియమాలు, పద్ధతులు, ప్రకటనలు, పథకాలు అబ్బొబ్బో ఒకటా, రెండా జగన్ అంటేనే వరాల జల్లు అనుకోవాలి జనం. అలా ఉంటారు ఆయన. మహా.. మహా దేశాధినేతలే మాస్కులు పెట్టుకు తిరుగుతున్నా కరోనా రోజుల్లో కూడా జగన్ మాస్క్ పెట్టుకోలేదు.
 
ఏ మీటింగ్ పెట్టినా అధికారులంతా మాస్క్ పెట్టాలే గానీ జగన్ మాత్రం మాస్క్ పెట్టుకోరు. పైగా కరోనాపై సమీక్షల సందర్భంలోనూ మాస్క్ పెట్టరు. ''నేను పటిష్టమైన భద్రత మధ్య ఉన్నాను. నాకు కరోనా రాదు'' అనుకున్నారో ఏమో.. ఈ రెండేళ్లలో ఆయన మాస్క్ పెట్టుకుని కనిపించిన సందర్భాలు చాలా తక్కువ.
 
అయితే ఉన్నట్టుండి ఏమయిందో ఏమోగాని ఆయన సోమవారం పోలవరం పర్యటనలో మాత్రం మాస్క్ పెట్టుకుని అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. సీఎం జగన్‌లో వచ్చిన ఈ సడెన్ మార్పు మంచిదే అంటూ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుకు న్యూయార్క్‌ శాండ్‌విచ్... యమ్మీ టేస్ట్‌తో అదుర్స్