శాండ్ విచ్ అంటే ఇష్టపడని వారంటూ వుండరు. ఆహార ప్రియులకు శాండ్ విచ్‌లు అందించేందుకు రెస్టారెంట్లు పోటీ పడుతుంటాయి. తాజాగా న్యూయార్క్‌లోని ఓ రెస్టారెంట్ శాండ్ విచ్‌ల తయారీలో ఫేమస్‌గా మారింది. అక్కడ విభిన్నమైన శాండ్ విచ్‌ల తయారీనే కాదు.. వాటి ధరలు కూడా బాగా ఎక్కవగానే ఉంటాయి. ఆ రెస్టారెంట్ రూపొందించిన ఓ శాండ్ విచ్ ప్రస్తుతం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులకెక్కింది.
వివరాల్లోకి వెళితే… న్యూయార్క్‌లోని స్రెండిప్టీ3 పేరుతో ఓ రెస్టారెంట్ శాండ్ విచ్‌లను తయారు చేయటంలో చాలా ఫేమస్. ఇక్కడ తయారయ్యే రుచికరమైన శాండ్ విచ్‌లను తినేందుకు దూరప్రాంతాల నుండి ఆహార ప్రియులు వస్తుంటారు. ప్రపంచంలో ఎక్కడ దొరకని వెరైటీ శాండ్ విచ్‌లు ఇక్కడ లభిస్తాయి. అయితే తాజాగా ఈ రెస్టారెంట్ నిర్వాహకలు రూపొందించిన శాండ్ విచ్ గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది.
ఇంతకీ దాని స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలో ఖరీదైన వెన్న క్వీన్ టెస్సెన్షియల్ గ్రిల్ల్డ్ చీజ్ ను ఈ శాండ్ విచ్ తయారీలో వాడతారు. దీనికి పైపూతగా గోల్డ్ ఫాయిల్ తో అలంకరిస్తారు. అందుకే ఈ శాండ్ విచ్ ఖరీదు 16వేల రూపాయలు.
సాధారణంగా రెస్టారెంట్లలో దొరికే శాండ్ విచ్ ల ఖరీదు 100 నుండి 200 రూపాయలు ఉంటాయి. గత ఏడేళ్ళ కాలంలో ఇంత ఖరీదైన శాండ్ విచ్ ను ఎవరూ తయారు చేయలేదు. దీంతో గిన్నీస్ బుక్ నిర్వాహకులు వరల్డ్ రికార్డుకు ఎంపిక చేశారు.
దీనిని తినాలనుకునే వారు 48 గంటల ముందుగా రెస్టారెంట్ కు ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనిలో వాడే పదార్ధాలన్నింటిని వివిధ ప్రాంతాల నుండి తెప్పించి ఆతరువా తయారీ మొదలు పెడతారు. క్విన్ టెస్సెన్షియల్ గ్రిల్డ్ ఛీజ్ లో ఫ్రెంచ్ పుల్లమాన్ షాంపెయిన్ బ్రెడ్ ముక్కలతోపాటు, డోమ్ పెరిగ్నాన్ షాంపెయిన్ ట్రాఫల్ బటర్ వాడతారు.