Webdunia - Bharat's app for daily news and videos

Install App

మజిలీ భామ కెరియర్ మలుపు తిరిగింది

Webdunia
శుక్రవారం, 15 జులై 2022 (17:25 IST)
Divyansha Kaushik
శివ నిర్వాణ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన `మజిలీ` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది దివ్యాంశ కౌశిక్. అన్షు పాత్రలో మొదటి సినిమాతోనే కుర్రకారు హృదయాలను దోచుకుంది. ఈ చిత్రానికి అద్భుతమైన రివ్యూలు రావడంతో పాటు  బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది. దివ్యాంశ కౌశిక్ తన నటనా నైపుణ్యానికి చాలా ప్రశంసలు అందుకుంది. తరువాత ఆమె సిద్దార్థ్ నటించిన టక్కర్ సినిమాతో తమిళంలో అరంగేట్రం చేసింది.
 
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మళ్ళీ "రామారావు ఆన్ డ్యూటీ" చిత్రంతో తెలుగు సినిమాకు రీ ఎంట్రీ ఇచ్చింది.శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "రామారావు ఆన్ డ్యూటీ" చిత్రం నుండి ఇదివరకే విడుదలైన  సొట్టల బుగ్గల్లో పాటలో రవితేజ సరసన కనిపించి మరోసారి కుర్రకారును ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ భామ చేతినిండా అవకాశాలతో  ఈ ఇయర్ కేలండరను  తన కాల్షీట్స్ తో నింపేసింది.
 
కేవలం తెలుగు చిత్రాలు మాత్రమే కాకుండా తమిళ చిత్రాల అవకాశాలు కూడా దివ్యాంశ ను వెతుక్కుంటూ వస్తున్నాయి.  అందం, అభినయం సమపాళ్లలో ఉన్న దివ్యాంశ తన స్పీడ్ పెంచడం అభిమానులకు ఆనందం కలిగించే విషయం. రవితేజ సరసన దివ్యాంశ నటించిన రామారావు ఆన్ డ్యూటీ జులై 29 న రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఈ చిత్రానికి మంచి ఫలితాలు వస్తే ఈమెకు వరుస అవకాశాలు రావడం ఖాయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేణిగుంట: క్యాషియర్ మెడలో కత్తి పెట్టిన యువకుడు.. సంచిలో డబ్బు వేయమని? (video)

డిసెంబర్ 21-25 వరకు భవానీ దీక్ష.. భక్తుల కోసం భవానీ దీక్ష 2024 యాప్

ప్రేమకు హద్దులు లేవు.. వరంగల్ అబ్బాయి.. టర్కీ అమ్మాయికి డుం.. డుం.. డుం..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాయలసీమ, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments