Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామారావు ఆన్ డ్యూటీ నుంచి నా పేరు సీసా వ‌చ్చేసింది

Advertiesment
Ravi Teja, anveshi
, శనివారం, 2 జులై 2022 (16:37 IST)
Ravi Teja, anveshi
ప్రోమోతో అలరించిన మాస్ మహారాజా రవితేజ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ' థర్డ్ సింగల్ 'నాపేరు సీసా' పూర్తి పాటని విడుదల చేసింది చిత్ర యూనిట్. అన్వేషి జైన్ సీసా (సీకాకులం సారంగీ)గా పరిచయం అయింది. తన గ్లామర్, మెస్మరైజింగ్ లుక్స్, సిజ్లింగ్ షోతో ప్రేక్షకులని కట్టిపడేసింది. ఈ పాటలో ట్రెడిషనల్ వేర్ లో కనిపించిన రవితేజ సరసన ఉల్లాసంగా ఆడిపాడింది అన్వేషి. థియేటర్ లో మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించేలా వుంది 'నా పేరు సీసా'.
 
సామ్ సిఎస్ మాస్ ఈ పాటని డ్యాన్సింగ్ నెంబర్ గా కంపోజ్ చేయగా ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం ఆకట్టుకుంది.
♫నా పేరు సీసా
ఒకరికినే తేనె సీసా
ఒకరికినే కల్లు సీసా
ఒకరికినే  మసాలా సీసా
ఇంకొకరికి రసాల సీసా
అందరికీ అందిస్తాను స్వర్గానికి వీసా♫
పాట పల్లవిలో వినిపించిన ఈ లిరిక్స్ క్యాచిగా ఆకట్టుకున్నాయి. శ్రేయా ఘోషల్, సామ్ సిఎస్ ఫుల్ ఎనర్జీటిక్ గా ఈ పాటని ఆలపించారు.
 
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.
 
యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలుగా నటిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
 
 ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ ఐఎస్‌సి సినిమాటోగ్రఫీ అందించగా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
తారాగణం: రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ఫేమ్ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో ఫేమ్ శ్రీ, మధుసూదన్ రావు, సురేఖ వాణి తదితరులు.
 
సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: ఎస్ఎల్వి సినిమాస్ ఎల్ఎల్ పి, రవితేజ టీమ్‌వర్క్స్
సంగీతం: సామ్ సిఎస్
డివోపీ: సత్యన్ సూర్యన్ ఐఎస్సి
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నగ్నంగా ఫోజిచ్చి ఆశ్చర్యపరిచిన విజయ్ దేవరకొండ