Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామారావు ఆన్ డ్యూటీలో నా పేరు సీసా అంటోన్న అన్వేషి జైన్

Advertiesment
Anveshi Jain
, శుక్రవారం, 1 జులై 2022 (15:50 IST)
Anveshi Jain
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ' షూటింగ్ పూర్తి చేసుకుంది. జూలై 29 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
 
 'రామారావు ఆన్ డ్యూటీ' మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ''నా పేరు సీసా' థర్డ్ సింగిల్ జూలై 2న విడుదల కానుంది. తాజాగా ఈ పాట ప్రోమో లాంచ్ చేశారు. ఈ ప్రోమో  మాస్ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచింది. లిరికల్ వీడియో కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా అలరించింది. సామ్ సిఎస్ మాస్ డ్యాన్సింగ్ నెంబర్ గా కంపోజ్ చేసిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ పాటలో అన్వేషి జైన్ గ్లామరస్‌గా కనిపించారు. శ్రేయా ఘోషల్, సామ్ సిఎస్ ఫుల్ ఎనర్జీటిక్ గా ఈ పాటని ఆలపించారు.
 
యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలుగా నటిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
 
సామ్ సిఎస్  సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే విడుదలైన మొదటి రెండు పాటలు మెలోడీ హిట్స్ గా నిలిచి ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ ఐఎస్‌సి సినిమాటోగ్రఫీ అందించగా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
 
తారాగణం: రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ఫేమ్ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో ఫేమ్ శ్రీ, మధుసూదన్ రావు, సురేఖ వాణి తదితరులు.
 
సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: ఎస్ఎల్వి సినిమాస్ ఎల్ఎల్ పి, రవితేజ టీమ్‌వర్క్స్
సంగీతం: సామ్ సిఎస్
డివోపీ: సత్యన్ సూర్యన్ ఐఎస్సి
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేనేజర్లను విసిగిస్తున్న శ్రీలీల.. ఎందుకో తెలుసా?