Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్ త్వ‌ర‌గా కోలుకోవాలంటున్న మెగాస్టార్ చిరంజీవి

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (20:08 IST)
Mahesh-chiru
మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా వుండ‌డం తెలిసిందే. క‌రోనా టైంలో త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఇండ‌స్ట్రీ గురించి స్పందిస్తుంటారు. ఇప్పుడు ప్ర‌పంచంతోపాటు దేశ వ్యాప్తంగా క‌రోనా ఒమిక్రాన్ వేవ్ న‌డుస్తోంది. దీనితో ప‌లువురు క‌రోనాబారిన ప‌డుతున్నారు. గురువారంనాడే మహేష్ బాబు తాను కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యినట్టు పేర్కొన‌డంతో టాలీవుడ్ కంగారుప‌డింది. 
 
వెంట‌నే మెగాస్టార్ తోపాటు అంద‌రూ ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు.  చిరంజీవి ఈ విధంగా తెలియ‌జేశారు. మహేష్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అలాగే మళ్ళీ మహేష్, నిన్ను యాక్షన్ మోడ్ లో చూడడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు.
 
కాగా, ఇటీవ‌లే త‌న సినిమా సంక్రాంతికి రాక‌పోవ‌డంతో ఆరోగ్య‌పర‌మైన స‌మ‌స్య‌లు వుండ‌డంతో కాలికి శ‌స్త్ర చికిత్స చేసుకోవాల‌ని విదేశాల‌కు వెళ్ళాడు. ఇటీవ‌లే దుబాయ్‌లో త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, థ‌మ‌న్‌తో క‌లిసి ఓ సినిమా విష‌య‌మై చ‌ర్చిస్తున్న‌ట్లు పోస్ట్ చేశాడు కూడా. మ‌రి ఇప్పుడు క‌రోనాబారిన ప‌డ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments