Mohan Raja,Chiranjeevi, Editor Mohan
మెగాస్టార్ చిరంజీవి హిట్లర్ సినిమా తెలియందికాదు. ఆ చిత్రంతో ఆయన కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. వందరోజుల వేడుక కూడా అప్పట్లో జరుపుకుంది. హిట్లర్ 1997 లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఎడిటర్ మోహన్ సమర్పించగా ఎం. ఎల్. మూవీ ఆర్ట్స్ పతాకంపై ఎం. వి. లక్ష్మి నిర్మించారు. ఈ చిత్రంలో చిరంజీవి, రాజేంద్రప్రసాద్, రంభ ప్రధాన పాత్రలు పోషించారు. నటుడు, రచయిత ఎల్. బి. శ్రీరామ్ ఈ చిత్రానికి సంభాషణలు అందించాడు. ఈ చిత్రం 42 కేంద్రాల్లో శతదినోత్సవం పూర్తి చేసుకుంది. మంగళవారంనాటికి అనగా జనవరి 4,2022కు సిల్వర్ జూబ్లీకి చేరుకుంది. 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇప్పుడు దర్శకుడు అప్పుడు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన మోహన్ రాజా జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.
మలయాళంలో మమ్ముట్టి చేసిన హిట్లర్‌ను తెలుగులో రీమేక్ చేశారు. తెలుగు హక్కులు ఎడిటర్ మోహన్ తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన చిరంజీవి ఆ సినిమా తనకు బాగా నచ్చిందనీ, మీరు నిర్మిస్తే నేను చేయాలనుకుంటున్నట్లు తెలియజేశారు. అలా సెట్‌పైకి వెళ్ళింది. తల్లి తండ్రి మరణంతో ఆరుగురు చెల్లెల్లుకు అండగా అన్నగా నటించిన మెగాస్టార్ మెప్పించారు. భావేద్వేకాలతో ఈ సినిమా నడుస్తుంది. కొందరి కారణాలవల్ల అపార్థం చేసుకున్న చెల్లెల్లు చివరికి నిజం తెలుసుకుని క్షమాపణలు కోరుకునే దృశ్యంలో మెగాస్టార్ పలికిన హావభావాలు మర్చిపోలేనివి. తండ్రిగా దాసరి నారాయణరావు నటించారు.
మంగళవారంతో 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా మోహన్ రాజా ట్విట్టర్ లో అప్పటి వందరోజుల వేడుక సందర్భంగా దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా అప్పుడు ఆ సినిమాకు పనిచేశాను. ఇప్పుడు మెగాస్టార్ సినిమా 153వ సినిమా దర్శకుడిగా పనిచేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, హిట్లర్ టు గాడ్ ఫాదర్ అంటూ ట్వీట్ చేశాడు.