Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ కొత్త చిత్రం టైటిల్ అదే... మరో హిట్ ఖాయమంటున్న ఫ్యాన్స్

Webdunia
ఆదివారం, 31 మే 2020 (12:17 IST)
ప్రిన్స్ మహేష్ బాబు 27వ చిత్రంపై అధికారిక ప్రకటన ఆదివారం వెలువడింది. తన తండ్రి, సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ 77వ పుట్టినరోజు వేడుకను పురస్కరించుకుని, ఈ చిత్రం టైటిల్‌ను నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం టైటిల్‌ను "సర్కారి వారి పాట"గా ఖరారు చేశారు. ఈ టైటిల్ లోగోను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 
 
'సరిలేరు నీకెవ్వరు' చిత్రం తర్వాత మహేష్ బాబు మరో ప్రాజెక్టును అంగీకరించలేదు. దీంతో కొత్త ప్రాజెక్టు ఎప్పుడెప్పుడా అని అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం మ‌హేశ్ 27 సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌పై సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. 
 
ఈ చిత్రానికి "గీత గోవిందం" ఫే పరశురాం దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, సంస్థలు కలిసి సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా పి.ఎస్.వినోద్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. 
 
మరోవైపు సర్కారి వారి పాట అధికారిక పోస్టర్ ఆదివారం ఉదయం 9.09 నిమిషాలకు విడుదల కాగా, అది క్షణాల్లోనే వైరల్ అయింది. 'సర్కారు వారి పాట' టైటిల్ యునీక్‌గా, సూపర్బ్‌గా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ప్రకటనతోనే మహేశ్ బాబు సినీ కెరీర్‌లో మరో హిట్ పడిపోయిందని అంటున్నారు.
 
మరికొందరు అభిమానులైతే, 'మరో హ్యాట్రిక్ కోసం బ్లాక్ బస్టర్ మొదలు' అంటూ ఈ పోస్టర్‌పై మహేశ్ బాబు కామెంట్ పెట్టారు. ఇక ఫ్యాన్స్ అయితే, 'మాసివ్ మేకోవర్ లోడింగ్... ఒక్కొక్కడికీ గజం దింపుదాం అన్నా' అని, 'ఇక థియేటర్లలో పొర్లు దండాలే' అని కామెంట్లు పెడుతున్నారు. 
 
కాగా, ఈ టైటిల్ లోగోతో పాటు మహేష్ బాబు స్టిల్‌ను కూడా రిలీజ్ చేశారు. మహేశ్ బాబు ముఖాన్ని కొంత భాగం చూపించారు. ఆయన మెడపై రూపాయి బిళ్ల పచ్చబొట్టు పొడిపించుకుని ఉండడం ఇందులో చూడొచ్చు. అలాగే, చెవిపోగు, కొత్త హెయిర్‌ స్టైల్‌తో మహేశ్ కనపడుతుండటం గమనార్హం. గతంలో వచ్చిన పోకిరి చిత్రం తరహాలో ఈ స్టిల్ ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డొనాల్డ్ ట్రంప్- కమలా హ్యారిస్‌లకు విడి విడిగా లేఖ రాసిన రాహుల్

రాజీ కుదిరితే కేసు కొట్టేస్తారా.. టీచర్‌ను ప్రాసిక్యూట్ చేయండి.. సుప్రీంకోర్టు

సొంత చెల్లిని తిడితే జగన్‌కు పౌరుషం రాలేదా? హోంమంత్రి అనిత

దేశంలో అత్యధిక విరాళాలు ఇచ్చిన శివ్ నాడార్..

2025 జనవరి 20న మధ్యాహ్నం డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

తర్వాతి కథనం
Show comments