Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#HBDSuperstarKrishnaGaru .. సాహసానికి మారుపేరు మీరు : చిరంజీవి

Advertiesment
#HBDSuperstarKrishnaGaru .. సాహసానికి మారుపేరు మీరు : చిరంజీవి
, ఆదివారం, 31 మే 2020 (10:46 IST)
టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని మే 31వ తేదీ ఆదివారం తన 77వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే విషెస్ చెపుతూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
ఇందులో.. 'కథానాయకుడిగా 345 సినిమాలు, దర్శకుడిగా 14 చిత్రాలు, నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయ భాషల్లో 50 చిత్రాలు. మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే. మొదటి 70ఎంఎం చిత్రం కూడా ఆయనదే. అనితర సాధ్యం ఈ ట్రాక్ రికార్డ్. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సూపర్‌స్టార్ కృష్ణ‌గారికి జన్మదినశుభాకాంక్షలు' అంటూ పేర్కొన్నారు. 
 
కాగా, తెలుగు చ‌ల‌న చిత్ర‌సీమ మ‌ర‌చిపోలేని విధంగా త‌న‌దైనముద్ర వేసిన వ్య‌క్తి కృష్ణ. ఈ సంద‌ర్భంగా తెలుగు సినీ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులంద‌రూ కృష్ణ‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చిరంజీవి కూడా విషెస్ చెప్పారు. 
 
నా ఎవర్‌గ్రీన్ సూపర్ స్టార్... మహేష్ బాబు
 
సూపర్ స్టార్ కృష్ణ తన 77వ పుట్టినరోజు వేడుకలను మే 31వ తేదీ ఆదివారం జరుపుకుంటున్నారు. ఒక హీరోగానే కాకుండా, నిర్మాతగా దర్శకుడిగా, స్టూడియో అధినేతగా రాణించి, తెలుగు చిత్రపరిశ్రమపై చెరగని ముద్రవేసిన ఎవర్ గ్రీన్ హీరో సూపర్ స్టార్ కృష్ణ. 
 
ఆయన సినీ కెరీర్‌లో 350కి పైగా చిత్రాల్లో నటించిన నటుడు. తెలుగు సినిమాను సాంకేతికంగా కొత్త పుంత‌లు తొక్కించిన వ్య‌క్తి కృష్ణే. అలాంటి కృష్ణ పుట్టిన‌రోజు సందర్భంగా తెలుగు సినీ ప్ర‌ముఖులంద‌రూ కృష్ణ అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. 
 
కృష్ణ త‌న‌యుడు నేటి త‌రం సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, కోడ‌లు న‌మ‌త్రా శిరోద్క‌ర్‌, మ‌న‌వ‌డు గౌత‌మ్‌, మ‌న‌వ‌రాలు సితార త‌దిత‌రులు కృష్ణ‌కు పుట్టిన రోజు అభినంద‌న‌లు తెలిపారు. 
 
'నా ఎవ‌ర్ గ్రీన్ సూప‌ర్‌స్టార్‌. హ్య‌పీ బ‌ర్త్ డే నాన్న‌. మీకెప్ప‌టికీ రుణ‌ప‌డి ఉన్నాను. మీ రుణం తీర్చుకోడానికి ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాను' అంటూ మహేశ్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు.. నా ఎవర్‌గ్రీన్ సూపర్ స్టార్... మహేష్ బాబు