సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు.. నా ఎవర్‌గ్రీన్ సూపర్ స్టార్... మహేష్ బాబు

ఆదివారం, 31 మే 2020 (10:32 IST)
సూపర్ స్టార్ కృష్ణ తన 77వ పుట్టినరోజు వేడుకలను మే 31వ తేదీ ఆదివారం జరుపుకుంటున్నారు. ఒక హీరోగానే కాకుండా, నిర్మాతగా దర్శకుడిగా, స్టూడియో అధినేతగా రాణించి, తెలుగు చిత్రపరిశ్రమపై చెరగని ముద్రవేసిన ఎవర్ గ్రీన్ హీరో సూపర్ స్టార్ కృష్ణ. 
 
ఆయన సినీ కెరీర్‌లో 350కి పైగా చిత్రాల్లో నటించిన నటుడు. తెలుగు సినిమాను సాంకేతికంగా కొత్త పుంత‌లు తొక్కించిన వ్య‌క్తి కృష్ణే. అలాంటి కృష్ణ పుట్టిన‌రోజు సందర్భంగా తెలుగు సినీ ప్ర‌ముఖులంద‌రూ కృష్ణ అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. 
 
కృష్ణ త‌న‌యుడు నేటి త‌రం సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, కోడ‌లు న‌మ‌త్రా శిరోద్క‌ర్‌, మ‌న‌వ‌డు గౌత‌మ్‌, మ‌న‌వ‌రాలు సితార త‌దిత‌రులు కృష్ణ‌కు పుట్టిన రోజు అభినంద‌న‌లు తెలిపారు. 
 
'నా ఎవ‌ర్ గ్రీన్ సూప‌ర్‌స్టార్‌. హ్య‌పీ బ‌ర్త్ డే నాన్న‌. మీకెప్ప‌టికీ రుణ‌ప‌డి ఉన్నాను. మీ రుణం తీర్చుకోడానికి ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాను' అంటూ మహేశ్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

 
 

Here it is!!! #SarkaruVaariPaata

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం లైట్స్ - కెమెరా - యాక్షన్ : చెన్నైలో టీవీ సీరియల్స్ షూటింగ్ ప్రారంభం