Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ ఫ్యాన్స్ గుడ్‌న్యూస్..!

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (17:09 IST)
మహేష్ బాబు 25 చిత్రం 'మహర్షి'. ఇందులో మహేష్ బాబు కాలేజీ స్టూడెంట్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ తరువాత మహేష్ నటిస్తున్న సినిమా మహర్షి కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహేష్ జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు.
 
టాలీవుడ్ టాప్ నిర్మాతలు దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా ఈ సినిమా నిర్మించగా.. 1 నేనొక్కడినే, శ్రీమంతుడు, భరత్ అనే నేను వంటి చిత్రాలతో మహేష్‌కి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్ మహర్షి చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. మే 9వ తేదీన మహర్షి విడుదల చేయడానికి సన్నాహాలు సాగిస్తున్నారని దేవి శ్రీ ప్రసాద్ మహేష్ ఫ్యాన్స్ గుడ్‌న్యూస్ అందించారు. 
 
మహర్షి చిత్రం ఫస్ట్‌సాంగ్‌ను మార్చి 29వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ.. మహేష్ కూతురు సితారతో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల సితార బాహుబలి పాటకు డాన్స్ చేస్తూ మహేష్ ఫ్యాన్సును థ్రిల్ చేసిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేసిన ప్రియురాలు

ఏపీ మద్యం కేసు : అట్టపెట్టెల్లో దాచిన కరెన్సీ కట్టలు స్వాధీనం

రష్యా తీరంలో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments