Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌ బాబు చాలా లేజీ, ఎన్టీఆర్ చాలా క్రేజీ... ఎవరు?

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (16:34 IST)
మహేష్‌ బాబు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టడం ఏంటి..? అది కూడా సత్యదేవ్ పెట్టడం ఏంటి..? అనుకుంటున్నారా..? కానీ.. ఇది నిజంగా నిజం. ఇంతకీ విషయం ఏంటంటే... సత్యదేవ్ నటించిన తాజా చిత్రం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. ఈ చిత్రానికి కంచరపాలెం దర్శకుడు మహా దర్శకత్వం వహించారు.
 
ఈ చిత్రాన్ని బాహుబలి చిత్ర నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించారు. ఇది మలయాళం చిత్రం మహేషిన్తే ప్రతీకారం చిత్రానికి రీమేక్. ఈ చిత్రాన్ని థియేటర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ... కరోనా కారణంగా ఓటీటీలో రిలీజ్ చేసారు. ఇందులో సుహాన్ ఎన్టీఆర్ వీరాభిమానిగా నటిస్తే... అతని గర్ల్ ఫ్రెండ్ మహేష్ బాబు ఫ్యాన్‌గా నటించింది.
 
వీరిద్దరి మధ్య సంభాషణలో మహేష్ బాబు చాలా లేజీ అందుకనే ఉన్న చోటనే కదలకుండా విలన్‌ని చంపేస్తాడు. అదే ఎన్టీఆర్ చాలా క్రేజీ.. విలన్‌ని పరిగెట్టించి పరిగెట్టించి మరీ చంపుతాడు అంటాడు. ఈవిధంగా మహేష్ బాబు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టారని చెప్పచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్.
 
ఇక ఈ సినిమా విషయానికి వస్తే... మంచి సినిమా అనే టాక్ తెచ్చుకుంది. సత్యదేవ్ మాత్రం పాత్రకు తగ్గట్టుగా అద్భుతంగా నటించాడనే పేరు తెచ్చుకున్నాడు. మరి... ఈ ఫ్యాన్స్ వార్ ఎంతవరకు వెళుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments