ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో మ‌హేష్ బాబు... బాలయ్య స్వయంగా ఫోన్

నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ సినిమాగా వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాను జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ-ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమాని జులై మొద‌టి వారంలో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నా

Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (22:14 IST)
నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ సినిమాగా వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాను జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ-ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమాని జులై మొద‌టి వారంలో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే... ఈ సినిమా క్రిష్ చేతిలోకి వ‌చ్చిన త‌ర్వాత చాలా మార్పులు జ‌రిగాయ‌ట‌. అక్కినేని పాత్ర నిడివి పెంచాడ‌ట‌. ఇక ఇప్పుడు మ‌రో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.
 
అది ఏంటంటే... కృష్ణ పాత్ర‌ను మ‌హేష్ బాబుతో చేయించాల‌నుకుంటున్నార‌ట‌. స్వ‌యంగా బాల‌కృష్ణే ఫోన్ చేసి మ‌హేష్ బాబుని అడిగార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌హేష్ కూడా తండ్రి పాత్ర‌ను పోషించేందుకు ఓకే చెప్పార‌ట‌. అలాగే ఇంకా చాలామంది సినీ ప్ర‌ముఖులు ఇందులో న‌టించ‌నున్నార‌ని తెలిసింది. క్రిష్ రంగంలోకి దిగిన త‌ర్వాత ఈ ప్రాజెక్ట్ పైన మ‌రింత క్రేజ్ పెరిగింది. ద‌గ్గుబాటి రానా చంద్ర‌బాబు నాయుడు పాత్ర పోషిస్తున్న విష‌యం తెలిసిందే. నిజంగా మ‌హేష్ ఇందులో న‌టిస్తే... ఈ ప్రాజెక్ట్ చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మటన్ కూరలో కారం ఎక్కువైందని భర్త మందలింపు.. భార్య సూసైడ్... మనస్తాపంతో భర్త కూడా

Kavitha: ఆంధ్ర రాజకీయ నాయకులు మాటలు నచ్చవు.. అదేంటి అలా తిట్టుకోవడం?

మద్యం మత్తులో భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త... పుర్రెను చీల్చుకుని నోట్లో నుంచి...

భారతీయ విద్యార్థులకు శుభవార్తం - హెచ్-1బీ వీసా ఫీజు చెల్లించక్కర్లేదు...

రౌడీ షీటర్ వేధింపులతో వివాహిత ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments