Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్‌బాస్‌ కోసం అలాంటి ఆఫర్ వచ్చింది.. మహేష్ బాబు ముందే బూతులు?: మాధవీ లత

బిగ్‌బాస్‌లో కూడా క్యాస్టింగ్ కౌచ్ వుందని సినీ నటి మాధవీ లత చెప్పింది. సినీ పరిశ్రమకు సంబంధించిన ఏ విషయంలో అయినా క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని మాధవీలత తెలిపింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సెలక్షన్ కమిటీలో క

Advertiesment
Nani
, శుక్రవారం, 22 జూన్ 2018 (15:06 IST)
బిగ్‌బాస్‌లో కూడా క్యాస్టింగ్ కౌచ్ వుందని సినీ నటి మాధవీ లత చెప్పింది. సినీ పరిశ్రమకు సంబంధించిన ఏ విషయంలో అయినా క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని మాధవీలత తెలిపింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సెలక్షన్ కమిటీలో కీలక వ్యక్తి తనకు ఫోన్ చేశాడని మాధవీలత తెలిపింది. అతడు ఫోన్‌లో బిగ్ బాస్ అవకాశం వుందని తెలిపాడు. ఓకే అయితే మనం ఎంజాయ్ చేద్దామని అడిగినట్లు మాధవీలత చెప్పింది. అతని ఉద్దేశం తెలుసుకున్నాక బిగ్ బాస్‌‌కు వెళ్లలేదని తెలిపింది. 
 
అతడు ఫోన్ చేసి దాదాపు 20 నిమిషాలు మాట్లాడాడని మాధవీలత తెలిపింది. ఈ సారి బిగ్ బాస్‌లో మంచి మసాలా యాడ్ చేస్తున్నాం. ఇష్టమైతే ఎక్స్ ఫోజింగ్ చేసేలా దుస్తులు వేసుకోవచ్చు అని ఫోన్‌లో చెప్పాడని.. తాను క్యాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పటికీ.. తనవద్ద ఇలా అడుగుతున్నావే అంటే.. ఇది క్యాస్టింగ్ కౌచ్ కాదు మాధవి, కానీ సింగిల్‌గా వున్నావుగా.. ఫీలింగ్స్ వుంటాయని అడిగినట్లు చెప్పుకొచ్చింది. 
 
బిగ్ బాస్ కూడా కాస్టింగ్ కౌచ్‌కు అతీతం కాదని మాధవీలత తెలిపింది. చాలామంది అమ్మాయిలే ఫోన్ చేసి తాము రెడీ అని చెప్తున్నట్లు తనకు తెలిసిందని.. అవకాశాల కోసం అమ్మాయిలు ఆశపడతారని కాబట్టి వారిని తాను తప్పుబట్టనని మాధవీలత వెల్లడించింది. 
 
అలాగే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుపై కూడా మాధవీ లత మండిపడింది. 'అతిథి' సినిమా షూటింగ్ సందర్భంగా మహేష్ బాబు ముందే డైరెక్టర్ తనపై ఓ బూతు పదం వాడాడని... అయినా మహేష్ బాబు స్పందించలేదని ఆమె తెలిపింది. షూటింగ్ సమయంలో ఏం జరిగినా తెలుగు హీరోలు పట్టించుకోరని.. మాధవీలత ఆవేదన వ్యక్తం చేసింది. పెద్దస్టార్ అయిన మహేష్ బాబు ముందే అలా జరిగినా.. ఆయన ఒక్క మాట చెప్పలేదని మాధవీలత తెలిపింది. 
 
మన తెలుగు హీరోలు కేవలం స్క్రీన్ మీదే రియాక్ట్ అవుతారని, రియల్ లైఫ్‌లో స్పందించరని తెలిపింది. మహేష్ బాబుపై తనకు ఎలాంటి శత్రుత్వం లేదని, కానీ అమ్మాయిల సమస్యలపై హీరోలు ఎందుకు స్పందించడం లేదని మాధవీలత స్పందించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''జబర్దస్త్'' తిట్లు, బూతులు ఇష్టంలేక.. బయటికి వచ్చేశా: షకలక శంకర్