ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో.. అతడే.. అంటూ నందమూరి బాలకృష్ణ అనగానే నడుచుకుంటూ వస్తుంటాడు మహేష్‌బాబు. ఇది బాలకృష్ణ ఓటీటీకి కోసం చేస్తున్న `అన్ స్టాపబుల్` ప్రోగ్రామ్. గత నెలలో షూట్ చేసిన ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 4న టెలికాస్ట్ కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి ప్రోమో విడుదల చేశారు. ఇందులో పలు ఆసక్తికరమైన ప్రశ్నలు వున్నాయి. సరదాగా సాగిన వాటిల్లో కొన్ని మీకోసం..
అసలు మహేష్ ఎవరు?
నేను ఫాదర్‌లా వుంటాను.
ఇంటిలో కేట్ ఎవరు? బ్రాట్ ఎవరు?
గౌతమ్ కేట్, సితార బ్రాట్
నాన్నగారు సెటైర్‌గా వుంటారు? మరి మీరు?
నేనూ సెటైర్‌గా వుంటా. నా టైమింగ్‌లో వుంటుంది.
కె.బి.ఆర్. పార్క్‌లో ఏం జరిగింది?
ఒకరోజు కె.బి.ఆర్. పార్క్‌లో ఫుల్ రౌండ్ వేసి చివరికి వచ్చాక ఆగాను. ఎదురుగా పాము ఇలా తిరిగింది. అది చూసి ఐదు కిలోమీటర్లు రన్నింగ్ చేశా. మళ్ళీ కెబి.ఆర్. పార్క్‌కు వెళ్ళలేదు.
ఎవరో నిన్ను లెక్కచేయలేదట?
అది భరత్ అనే నేను సినిమా షూటింగ్. కెమెరా ఫ్రంట్ రోల్‌లో ప్లే అవుతుంది. సీరియస్‌గా డైలాగ్‌లు చెబుతున్నా. ఒకావిడ ఫోన్‌లో గేమ్‌లు అడుకుంటుంది. ఏమ్మా! ఫోన్ ఆఫ్ చేయి అన్నా. అదే మీరైతే మైక్ విసిరేసేవారు.
1000మంది గుండె ఆపరేషన్‌లు చేసి పేదల గుండెల్లో నిలిచిపోయారే?
గౌతమ్ ఆరునెలల ముందుగానే పుట్టాడు. నా అరచేయి అంత వున్నాడు. మాకు డబ్బులున్నాయి. ఓకే. చాలామంది పరిస్థితి ఏమిటి? అనే ఆలోచనే ఇలా సేవ చేయడం మొదలుపెట్టాను.