Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌ - పరశురామ్ మూవీ ఓపెనింగ్ అండ్ రిలీజ్ డేట్

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (19:45 IST)
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సక్సస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతికి రిలీజై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. మహేష్ బాబు వంశీ పైడిపల్లితో సినిమా చేయాలనుకోవడం.. ఆ సినిమా క్యాన్సిల్ అవ్వడం తెలిసిందే. దీంతో గీత గోవిందం సినిమాతో బ్లాక్‌బస్టర్ సాధించిన టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్‌తో సినిమా చేయడానికి మహేష్ ఓకే చెప్పారు.
 
దీంతో మహేష్ - పరశురామ్ కాంబినేషన్లో సినిమా చేయడానికి రంగం సిద్దమయ్యింది. ప‌రుశురామ్‌కు అద్భుతమైన కథను రెడీ చేయడానికి కావాల్సినంత టైమ్ దొరికింది. స్క్రిప్ట్‌ను మరింతగా మెరుగులు దిద్దే ప‌నిలో ప‌డ్డాడీ ఈ ద‌ర్శ‌కుడు. ఈ క్రేజీ మూవీని నిర్మించడానికి పలు నిర్మాణ సంస్థలు పోటీపడ్డాయి. అయితే.. ఈ మూవీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఏ తరహా కథతో సినిమా ఉంటుంది..? మహేష్ పాత్ర ఎలా ఉండబోతుంది..? కథానాయిక ఎవరు..? ఇలా... అనేక ప్రశ్నలు. 
 
మహేష్‌ బాబు ఇప్పటివరకు చేయనటువంటి పాత్రను ఇందులో చేస్తున్నాడని.. ఈ పాత్ర అందరికీ కనెక్ట్ కావడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. అయితే.. మహేష్ కథల విషయంలో రాజీపడడం లేదు. తాజా సమాచారం ప్రకారం.. మహేష్ ఈ సినిమా విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారని తెలిసింది. ఇంతకీ విషయం ఏంటంటే...  సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మే 31న సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. 
 
జూలైలో రెగ్యుల‌ర్ షూటింగ్‌ను స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది స‌మ‌ర్మ్‌లో ఏప్రిల్ 28న విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ని తెలిసింది. ఇదే రోజున ఎందుకు రిలీజ్ చేయాలనుకుంటున్నారంటే...  14 ఏళ్ల క్రితం అంటే 2006లో మ‌హేష్‌ కెరీర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచి, మ‌హేష్ ని సూప‌ర్‌స్టార్‌గా నిల‌బెట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంచలన చిత్రం పోకిరి విడుద‌లైంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పోకిరి చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అందుకనే...అదే రోజున త‌న 27వ సినిమాను మ‌హేష్‌ విడుద‌ల చేయాల‌నుకుంటున్నారని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు.. ఆధిక్యంలో బీజేపీ.. ట్రెండ్స్ మారితే?

మహారాష్ట్రలో తదుపరి సీఎం ఎవరు.. అప్పుడే మొదలైన చర్చ?

జార్ఖండ్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments