మహేష్ బాబు సరసన నటించేందుకు పోటీ.. కైరానా సారానా?

బుధవారం, 1 ఏప్రియల్ 2020 (16:13 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్ల మధ్య పోటీ నెలకొనేలా వుంది. మహేశ్ బాబు తన తదుపరి సినిమాను పరశురామ్ దర్శకత్వంలో చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ తరువాత సినిమాను ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. 
 
ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్‌ను తీసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా బాలీవుడ్ కథానాయికల పేర్లు వినిపిస్తున్నాయి. ఇలా దర్శకనిర్మాతలు పరిశీలిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ల జాబితాలో కైరా అద్వానీ, సారా అలీఖాన్ పేర్లు ముందు వరుసలో వినిపిస్తున్నాయి. 
 
మహేశ్ బాబు ఇప్పటికే 'భరత్ అనే నేను' సినిమాలో కైరా అద్వానితో జోడీ కట్టేశాడు. అందువలన సారా అలీఖాన్‌ను తీసుకునే దిశగా దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 'భరత్ అనే నేను'లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరింది కాబట్టి కైరానే ఖాయం చేసే అవకాశాలు లేకపోలేదని టాక్ వస్తోంది. మరి కైరా, సారా వీరిద్దరిలో ఎవరికి ప్రిన్స్ సరసన నటించే అవకాశం వస్తుందో తెలుసుకోవాలంటే.. వేచి చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అందరూ ఇళ్లలోనే ఉండి రాగిణి ఎమ్ఎమ్ఎస్ రిటర్న్స్ చూడండి.. సన్నీతో నవదీప్