నరేష్ కానీ, నేను కానీ బయట విడిగా వెల్లాసివస్తే మీరు ఒక్కరే వచ్చారు.. వారు రాలేదా.. అని అడుగుతున్నారు. మా జంట ప్రజలకు నచ్చింది. అలాగే మా ఇరు కుటుంబాల వారికి ఆమోదం అయింది. మహేష్ బాబు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. అని పవిత్ర లోకేష్ తెలిపారు. మల్లి పెళ్లి సినిమా ప్రమోషన్ లో ఆమె మాట్లాడారు.
- నరేష్‌లో నాకు చాలా నచ్చేది ఆయన నన్ను ఆప్యాయంగా చూసుకునే విధానం. అతను తేలికైనవాడు. తీవ్రమైన సమస్యలను కూడా ప్రశాంతంగా ఆలోచించగలడు. నేను అలా కాదు. అతనిలోని అత్యుత్తమ గుణం ఏమిటంటే, అతను ఈ క్షణంలో జీవించాలీ. రేపు ఎలా ఉంటుందో చెప్పలేం అనేవాడు.
- నేను విజయ నిర్మల గారిని కలిసే సమయానికి ఆమె ఆరోగ్యం బాగోలేదు.నేను ఆమెతో ఎక్కువ సమయం గడపలేకపోయాను. కానీ నేను (సూపర్‌స్టార్) కృష్ణగారితో సమయం గడపవలసి వచ్చింది. అతనితో చిన్నపాటి సాన్నిహిత్యం పెంచుకునే అదృష్టం నాకు కలిగింది. పెద్ద కుటుంబం (నరేష్) నన్ను ఆదరించింది. సామాజిక అంగీకారం నాకు ముఖ్యం కాదు.
- మా సంబంధం మా వ్యక్తిగత విషయం. మా కుటుంబ సభ్యులు మా నిర్ణయాన్ని అంగీకరించిన తర్వాత నేను, నరేష్ దానిని ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ఇతరులు మమ్మల్ని వివాదాస్పద స్థితిలోకి నెట్టారు. కాబట్టి, మేము దాని నుండి ఎలాగైనా బయటపడవలసి వచ్చింది. 'మళ్లీ పెళ్లి' అది నిరూపించుకోవడానికి తీయలేదు. ఇప్పటికి నేనూ, నరేష్ జంట అన్న సంగతి అందరికీ తెలిసిందే. మా జంట వల్ల సమాజం పెద్దగా బాధపడుతుందని నేను అనుకోను. కొంతమందికి మాత్రమే సమస్య ఉంటుంది.
నితిన్ నటిస్తున్న సినిమాలో నేను కనిపిస్తాను. కన్నడలో ఓ సినిమా రాబోతోంది. అన్నారు.