డా. నరేష్ వి.కె గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ 'మళ్ళీ పెళ్లి' హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. యూనిక్ కథతో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లో పవిత్ర లోకేష్ కథానాయిక. మెగా మేకర్ ఎంఎస్ రాజు రచన దర్శకత్వం వహిస్తున్నారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా దీనిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా చిత్ర దర్శకుడు ఎంఎస్ రాజు చెప్పిన ఇంటర్వ్యూ విశేషాలు.
మళ్లీ పెళ్లి కథ ఎలా వుంటుంది?
నేను నా స్వంత పనులకోసంబయటకు వెళ్ళినప్పుడు ఇదే ప్రశ్న తలెత్తుతుంది. ఈ సినిమాను మల్టీస్టారర్ అనాలో, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనాలో నాకే అర్థంకాలేదు. డిసెంబర్ 30నుంచి రకరకాల ప్రమోషన్‌లో ఈ సినిమా కథేమిటనేది ప్రేక్షకులకు తెలిసిపోయింది. పక్కవాడి జీవితంలో తొంగిచూడాలనే ఆతృత జనాల్లో వుంటుంది. ఒకరకంగా చెప్పాలంటే, మనం ఊరువెళితే కాలక్షేపం కబుర్లు వస్తుంటాయి. అలా అని ఈ సినిమా అలాంటిదికాదు. నా కెరీర్‌లో చాలా కష్టపడి చేసిన సినిమా. విజయనిర్మల, కృష్ణ గారు పెట్టిన బేనర్. నరేష్‌గారి 50 ఏళ్ళ కెరీర్‌ను బేసుకుని మంచి సినిమా చేయాలని నేనొక కథ చెప్పా. అది వారు విని, ఫ్రీడం ఇచ్చారు. ఎంత డెప్త్‌లోకి వెళతారో వెళ్ళండి అన్నారు. నేను రాశాను కాబట్టి ఇది నా కథా, నరేష్ కథా అనేది రేపు మీరు చూసి తెలుసుకోవచ్చు.
మీరు అనుకున్నట్లు కథను తీయగలిగారా?
నేను ఇంతకుముందు పెద్ద హీరోలతో చేశాను. డర్టీ హరీ సినిమా కొత్తవారితో చేశాను. ఓటీటీలో సెస్సేషనల్ అయింది. అందుకే తప్పటడుగువేయకుంగా ఈ సినిమాను తెరకెక్కించాం. వారిద్దరూ గొప్ప నటులు. వయస్సుమీద వున్నారు. కనుక వారి జీవితంలో జరిగిన కథ అని అనుకోవచ్చు. కానీ ఈ సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పను. కానీ ఈ సినిమాకు బెస్ట్ స్క్రీన్‌ప్లే ఇచ్చాను. మొత్తంగా సినిమాపై చాలా నమ్మకంతో వున్నాను. చాలా సరదాగా వుంటూ సంగీతపరంగా ఆకట్టుకుంటుంది. ఎటువంటి బోర్ లేకుండా ఎంటర్‌టైన్‌మెంట్ కలిగి వుంటుంది. లవ్, డ్రామాతోపాటు కొన్ని సెస్సేషనల్ అంశాలు ఇందులో వున్నాయి.
మెచ్యూర్డ్ లవ్‌స్టోరీ అన్నారు. ఈ కథను నరేష్, పవిత్రను దృష్టిలో పెట్టుకుని రాశారా?
నేను ఒక్కడు సినిమా రాసేటప్పుడు మహేష్‌బాబు అనుకోలేదు. కథంతా వచ్చాక తనే బాగుంటాడని అనుకున్నాం. ఇక మల్లీపెళ్లి కథ వచ్చేసరికి ఇది అందరికీ కనెక్ట్ విధంగా వుంటుంది. ఇది మొత్తం కల్పితం అని చెప్పలేను.
ఇందులో రియల్ సంఘటనలు ఎంత మేరకు వుంటాయి?
రియల్ సంఘటనలు వుంటాయని టీజర్, ట్రైలర్ చూస్తే అనిపిస్తుంటుంది. సినిమా చూశాక ఎంత మేరకు వుంటుందో మీరే చూసి చెబుతారు.
ఇది హైప్రొఫైల్ కాంట్రవర్సీ సినిమా అవుతుందా?
ఒకరు కన్నడ, మరొకరు తెలుగులో ఆర్టిస్టులు. మిడిల్ ఏజ్. ఇద్దరూ మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు అనే సరికి కొంతమందికి కనెక్ట్ అయినా అవ్వవచ్చు. ఇప్పటి జనరేషన్‌లో చాలా మార్పు వచ్చింది. అందరూ ఇండివిడ్యువల్‌గా బతకాలనుకుంటున్నారు. ఆ కోవలో ఈకథ వుంటుంది. ప్రేక్షకుడిని కొత్త లోకాన్ని చూపించాలని చేసిన సినిమా ఇది. అనుకోని కథలు కూడా ఇందులో మీకు కనిపిస్తాయి. నేను ఎందుకు తీశాననేది సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. ఒక్కోసారి మేజర్ సీన్స్ లొకేషన్‌లోనే రాసేవాడిని. ఏ మాత్రం తేడాలేకుండా చేసిన సినిమా ఇది.
ఇద్దరిలో నటనాపరంగా మీరు గమనించిన అంశాలు ఏమిటి?
ఇద్దరూ గొప్ప నటీనటులే. వారినుంచి 50శాతంపైగా నటన రాబట్టాను. బయట నరేష్ సరదాగా వుంటారు. కానీ రెడీ టేక్ అనగానే సీన్‌లో ఎమోషన్స్‌లో జీవించేస్తారు. ఆయన పెర్‌ఫార్మెన్స్‌కు చాలాసార్లు సెట్లో చప్పట్లు కొట్టేవారు. అయినా సరే ఇంకో టేక్ అని అడిగితే విసుక్కోకుండా చేసేవారు.
ఈ సినిమా ఎంతవరకు సెస్సేషనల్ అవుతుంది?
ఒకప్పుడు జనరేషన్ ఇరువైపులా అమ్మాయిని, అబ్బాయిని చూపించకుండాపెద్దలు చూసి చేసేవారు. ఆ తర్వాత ఫొటోలు చూపించే స్థాయికి మార్పు వచ్చింది. ఇప్పుడు అంతకుమించి అనే రీతిలో పెండ్లికిముందుగానే వాట్సప్ ద్వారా మెసేజ్‌లు కలుసుకోవడం జరిగిపోతుంది. కాలాన్ని బట్టి పరిస్థితులు, ఆలోచనలు మారిపోతుంటాయి. అదే నా సినిమాలో వుంటుంది. మనకు ఎలా బతికితే సంతోషమో అలా బతకమని చెప్పేదే సినిమా. అలా అని అని విచ్చలవిడితనం లేదు.
మీరు ట్రెండీగా సినిమాలు తీస్తున్నారు?
ఒక్కడు, నువ్వొస్తావంటే.. అలా ట్రెండీగా తీసినవే. డర్టీహరీ కూడా అలాంటిదే. ఆ సినిమా చేయమని యూత్ దర్శకుడిని అడిగితే చాలా బోల్డ్ కంటెంట్ చేయనన్నాడు. అప్పుడు నేనే దర్శకత్వం వహించా. ఏదైనా కొత్తదనంతో తీయాలనే తపనతో నేను దర్శకునిగా మారాను. లేదంటే ఇంట్లో కూర్చొనేవాడిని.
మళ్లీ పెళ్లి అనేది కృష్ణగారి పాత సినిమాటైటిల్ పెట్టారు?
మొదట్లో నాకు కృష్ణగారి సినిమా టైటిల్ అని తెలీదు. నరేష్‌గారే ఆ తర్వాత చెప్పారు. ఇంకేం పర్వాలేదు అని టైటిల్ పెట్టాం.
మారిన సొసైటీని బట్టి తీశారన్నారు. ఈ సినిమా అంతటితో ఆగిపోతుందా. ఇంకా నెక్ట్ స్టెప్‌కు వెళుతుందా?
సొసైటీలోని మార్పుకు అనుగుణంగానే సినిమా ఉంటుంది. అంతకంటే మోతాదు మించదు.
ఈ కథలో ఎంత నిజాయితీ వుంటుంది?
ఒంటరితనం అనేది ఎలా వుంటుందో అనేది నిజాయితీగా చూపించాం. గతంలో కృష్ణగారు, విజయనిర్మలగారి సినిమాలు కొన్ని బోల్డ్‌గా వున్నాయి. వాటికిమించిన విదంగామాత్రం వుండదు.
మీ వల్లే సినిమాకు హైప్ వచ్చింది అనిపిస్తుంది?
నావల్ల వచ్చింది కాదు. వారితో నా కలయిక వల్ల వచ్చిందనుకుంటున్నా. ఒక్కడు తీసుకంటే మహేష్‌బాబు, నేను, గుణశేఖర్ వుండబట్టే హైప్ వచ్చింది. ఇది అంతే అని ముగించారు.