Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాభారతంలో ఇంద్ర పాత్రధారి, నటుడు సతీష్ కౌల్ కరోనా వైరస్‌తో మృతి..

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (18:18 IST)
Satish Kaul
ప్రముఖ నటుడు సతీష్ కౌల్ కరోనా వైరస్‌కు గురై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. గత వారం రోజులుగా ఆయన కొవిడ్‌కు చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు.
 
బీఆర్ చోప్రా నిర్మించిన మహాభారతంతో పాటు పలు హిందీ చిత్రాలు నటించారు. పలు ప్రదర్శనల్లో పాల్గొన్నారు. లాక్‌డౌన్ మధ్య ప్రాథమిక అవసరాలతో పోరాడుతున్న ఈ నటుడు.. గత ఏడాది మే నెలలో చిత్ర పరిశ్రమ నుంచి ఆర్థిక సహాయం కోరారు.
 
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) 1969 బ్యాచ్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన సతీష్ కౌల్.. 1954 సెప్టెంబర్ 8న కాశ్మీర్‌లో జన్మించారు. బాలీవుడ్ నటులు జయ బచ్చన్, షత్రుఘ్న సిన్హా, జరీనా వహాబ్, డానీ డెంజోంగ్పా, ఆశా సచ్‌దేవా, ఓం పూరి వంటి వారు ఎఫ్టీఐఐలో అతని బ్యాచ్ మేట్స్.
 
సతీష్ కౌల్‌ ప్రధానంగా పంజాబీ సినిమాల్లో నటించారు. అతను 300 కి పైగా చిత్రాలలో పనిచేశారు. అందులో 85 చలన చిత్రాలలో ప్రధాన పాత్ర పోషించారు. కర్మ, ప్రేమ్ పర్బాట్, వారెంట్, గునాహో కా ఫైస్లా, భక్తి మీ శక్తి, డాన్స్ డాన్స్, రామ్ లఖన్, ప్యార్ తో హోనా హి థా వంటి కొన్ని బాలీవుడ్ చిత్రాలలో కూడా ఆయన నటించారు.
 
66 ఏండ్ల ఈ నటుడు మహాభారతం, విక్రమ్ ఔర్ బేతాల్‌ అనే టెలివిజన్ షోలలో నటించి మెప్పించారు. బీఆర్ చోప్రా నిర్మించిన మహాభారతం సీరియల్‌లో ఇంద్ర పాత్ర పోషించారు. సతీష్‌ కౌల్ ముంబై నుంచి పంజాబ్‌కు వెళ్లి 2011 లో యాక్టింగ్ స్కూల్‌ను ప్రారంభించాడు. 

సంబంధిత వార్తలు

పార్లమెంట్‌లో బీజేపీ ఉన్నంతవరకు రిజర్వేషన్లు చెక్కు చెదరవు : అమిత్ షా

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన... 24 నాటికి వాయుగుండం...

పిఠాపురం నుంచి అప్పుడే పనులు మొదలెట్టిన పవన్

మహిళపై పగబట్టిన పాము, ఆరేళ్లుగా అదను చూసి కాటు

కిడ్నీల దానం పేరు మనుషుల అక్రమ రవాణా.. కేరళ వాసి అరెస్టు!!

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments