Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా ‘‘మద్రాసి గ్యాంగ్’’ ప్రారంభం

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (19:42 IST)
పద్మజ ఫిలింస్ ఇండియా ప్రైవేట్ లిమెటెడ్ పతాకంపై ఎస్.ఎన్ రెడ్డి ‘‘మద్రాసి గ్యాంగ్’’ అనే కొత్త సినిమా తీస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీని అజయ్ ఆండ్రూస్ నూతంకి డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా జరిగాయి.
 
ఈ సందర్భంగా నిర్మాత ఎస్.ఎన్ రెడ్డి మాట్లాడుతూ, మా బ్యానర్లో ఇంతకుముందు మంచు మనోజ్‌తో ‘‘ఒక్కడు మిగిలాడు’’ మూవీ తీసిన అజయ్ ఆండ్రూస్ నూతంకి దర్శకత్వంలో మరో సినిమా తీస్తున్నాం. క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 13 నుండి ప్రారంభమవుతుంది.
 
హిందీ, తమిళ భాషల్లో భారీ స్థాయిలో నిర్మించబోతున్నాం. మెయిన్ లీడ్‌గా సంతోష్, రంగ జిను నటిస్తున్నారు. హీరో మంచు మనోజ్ గారు వచ్చి కెమెరా స్విచ్చాన్ చేసి, విషెస్ అందజేసినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకూమార్ ఈ మూవీ థీమ్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. అలాగే నటుడు సంపూర్ణేష్ బాబు తదితరులు వచ్చి విషెస్ తెలియజేశారు. వాళ్లందరికీ థాంక్స్.’’ అన్నారు.
 
నటీనటులు: సంతోష్, రంగ జిను, తదితరులు. టెక్నీషియన్స్: సినిమాటోగ్రఫీ: వి.కె రామరాజు, మ్యూజిక్: ఎన్.ఎస్ ప్రసు, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్ : శివ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్.వి.వి సత్యనారాయణ, లైన్ ప్రొడ్యూసర్స్: ధరణి కుమార్, రాధాకృష్ణ తాతినేని, నిర్మాత : ఎస్.ఎన్ రెడ్డి, రచన, దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్ నూతంకి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments