Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మా" ఎన్నికలు : పోటీ నుంచి తప్పుకున్న బండ్ల గణేష్

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (15:38 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల బరి నుంచి ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తప్పుకున్నారు. ఈ నెల 10వ తేదీన జరుగనున్న "మా" ఎన్నికల్లో బండ్ల గణేష్ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేశారు. అయితే, ఆయన శుక్రవారం ఉన్నట్టుండి తన నామినేషన్ పత్రాన్ని విత్ డ్రా చేసుకున్నారు. 
 
'నా దైవ సమానులు, నా ఆత్మీయులు, నా శ్రేయోభిలాషుల సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను' అని బండ్ల గణేష్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, ఈసారి ‘మా’ అధ్యక్ష పదవికి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, యంగ్ హీరో మంచు విష్ణు, సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహ రావు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఈ ముగ్గురితో పాటు ‘మా’ జనరల్ సెక్రెటరీ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా బండ్ల గణేష్ పోటీ చేసిన విషయం తెల్సిందే. 
 
అక్టోబర్ 10వ తేదీ కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులతో పాటు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురూచూస్తుంది. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ‘మా’ ఎన్నికలు జరుగుతాయి. ఆ రోజు సాయంత్రమే ఫలితాలు వెలువడతాయి. 


 

సంబంధిత వార్తలు

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments