Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మా- ఎన్నిక‌ల్లో బాబూమోహ‌న్ పోటీ

మా- ఎన్నిక‌ల్లో బాబూమోహ‌న్ పోటీ
, గురువారం, 9 సెప్టెంబరు 2021 (20:41 IST)
Babumohan
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ర‌క‌ర‌కాలుగా చ‌ర్చ‌కు తావిస్తున్నాయి. మా భ‌వ‌నం కొన‌డం, అమ్మ‌డం గురించి గ‌తంలోని విష‌యాల‌పై నాగ‌బాబు మాట్లాడ‌డం, దానికి మోహ‌న్‌బాబు కౌంట‌ర్ వేయ‌డం ఇలా ర‌క‌ర‌కాలుగా మారింది. ఇక జీవిత రాజశేఖ‌ర్ పేన‌ల్ లో వుంద‌నే సాకుతో బండ్ల గ‌ణేష్ త‌ప్పుకోవ‌డం వంటి ప‌రిణామాలు జరిగాయి. ఇవ‌న్నీ సినీప్ర‌ముఖుల‌కు త‌ల‌నొప్పిగా మారింది. ఎవ‌రైనా ఏ ఊరు వెళ్ళినా అక్క‌డ విలేక‌రులు ఇవే ప్ర‌శ్న‌లు వేస్తున్నారు.
 
గురువారంనాడు సీనియ‌ర్ న‌టుడు బాబూమోహ‌న్‌కు ఈ ప్ర‌శ్న ఎదురైంది. సంగారెడ్డిలో ఓ కార్య‌క్ర‌మానికి వెళ్ళిన ఆయ‌న్ను విలేక‌రులు మా ఎన్నికల వివాదంపై అడుగ‌గా ఆయ‌న ఇలా స్పందించారు. అసలు నోటిఫికేషన్ రాకుండా, ఇప్ప‌టి క‌మిటీ కాల‌ప‌రిమితి కాకుండా కొందరు ఎన్నికలు అని కళామ్మతల్లిని అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఇక, నన్ను పోటీ చేయమని కొందరు పెద్దలు అడుగుతున్నారన్న బాబు మోహన్.. దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అస‌లు మా క్లిష్ట ప‌రిస్థితుల్లో వుందని క‌నీసం భ‌వ‌నం లేద‌ని అన్నారు. కేవ‌లం మా భ‌వ‌నం కోసం గొడ‌వ జ‌రుగుతుంద‌ని ఇది స‌రికాద‌ని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ‌గాడు ఎలా వుండాల‌నే పాయింట్‌కు క‌నెక్ట్ అయ్యా- న‌టుడిగా మార‌డానికి ఆ మాట‌లే కార‌ణంః నాని