Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా ఎన్నికలు.. హీరోలు ఎందుకు పాల్గొనడం లేదు.. ప్రకాశ్ రాజ్ ప్రశ్న

Advertiesment
మా ఎన్నికలు.. హీరోలు ఎందుకు పాల్గొనడం లేదు.. ప్రకాశ్ రాజ్ ప్రశ్న
, మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (13:03 IST)
మా ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలోని  కొంతమంది స్టార్ హీరోలను మధ్యాహ్నం భోజనానికి పిలిచి, వారందరిని ఎందుకు మా ఎలక్షన్స్‌లో పాల్గొనడం లేదు అని ప్రశ్నించారు. అంతేకాదు వాళ్ల పర్సనల్ కారణాల వల్ల ఎలక్షన్లకు దూరంగా ఉంటే కచ్చితంగా వాటిని పక్కనపెట్టి, ఎలక్షన్లకు హాజరుకావాలని సూచించారు.
 
అంతేకాదు ప్రతి ఒక్కరు ఈ మా ఎలక్షన్స్‌లో పాల్గొనాలి అని తమ ఓటును వినియోగించాలని కూడా తెలిపాడు. ఇక అంతే కాదు తాను కనుక ఒకవేళ మా ఎలక్షన్స్ లో మా అధ్యక్షపదవిని గనుక పొందినట్లయితే, పది కోట్ల రూపాయలను స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు కేటాయిస్తానని తెలిపాడు. ఇకపోతే మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేసి అధ్యక్షుడిగా గెలిస్తే ఏకంగా భవనాన్ని నిర్మిస్తామని చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
 
లాక్ డౌన్ సమయంలో ఇలా స్టార్ హీరోలను భోజనానికి పిలవడం ఏంటి..? కరోనా నిబంధనలను పాటించడం లేదు అంటూ ప్రకాష్ రాజ్‌పై బండ్ల గణేష్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాను కరోనా నిబంధనలు పాటిస్తూ , కొంతమందిని.. మాత్రమే భోజనానికి ఆహ్వానం పలికినట్లు తెలిపాడు ప్రకాష్ రాజ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరో కృష్ణంరాజు తుంటి ఎముకకు ఆపరేషన్