Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనసూయ గొప్ప యాంకర్.. సుధీర్‌ను అందుకే తీసుకున్నాం.. ప్రకాష్ రాజ్

Advertiesment
అనసూయ గొప్ప యాంకర్.. సుధీర్‌ను అందుకే తీసుకున్నాం.. ప్రకాష్ రాజ్
, శనివారం, 4 సెప్టెంబరు 2021 (14:24 IST)
మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో భాగంగా నటుడు ప్రకాశ్‌ రాజ్‌ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ పదో తేదీన ఎన్నికలు జరుగనుండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 
 
శుక్రవారం సిని'మా'బిడ్డలు అనే పేరుతో తన ప్యానల్‌ సభ్యులను కూడా ప్రకటించారు. అందులో ప్రకాశ్‌రాజ్‌ (అధ్యక్షుడు), నాగినీడు (ట్రెజరర్‌), బెనర్జీ, హేమ (ఉపాధ్యక్షులు), శ్రీకాంత్‌ (ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌), జీవితా రాజశేఖర్‌ (జనరల్‌ సెక్రటరీ), అనితా చౌదరి, ఉత్తేజ్‌ (జాయింట్‌ సెక్రటరీ). ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా అనసూయ, అజయ్, బి.భూపాల్, బ్రహ్మాజీ, ప్రభాకర్, గోవిందరావు, ఖయ్యూమ్, కౌశిక్, ప్రగతి, రమణారెడ్డి, శివారెడ్డి, సమీర్, సుడిగాలి సుధీర్, డి.సుబ్బరాజు, సురేశ్‌ కొండేటి, తనీశ్, టార్జాన్‌ ఉన్నారు.
 
అయితే వీరిని మాత్రమే ఎందుకు తీసుకున్నారో కూడా వివరించారు. కొత్త వారికి, కుర్రాళ్లకి, మహిళలకు, బుల్లితెరకు అందరికీ ఇలా సమాన అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఇలా ప్యానెల్‌ను డిజైన్ చేశామని ప్రకాశ్‌ రాజ్ తెలిపారు. 
 
ఈ క్రమంలో బుల్లితెర యాంకర్‌ అనసూయ, నటుడు సుధీర్‌లను ఎగ్జిక్యూటీవ్‌ కమిటీ మెంబర్స్‌గా ఎందుకు తీసుకున్నారో కూడా వివరించారు. 'అనసూయ గొప్ప యాంకర్‌. అందరితో కలిసి మాట్లాడగలికే శక్తి ఉన్న లేడి. బుల్లితెర నటీనటుల కష్టాలు ఆమెకు బాగా తెలుసు. అందుకే ఆమెను సెలెక్ట్‌ చేశాం'అన్నారు. 
 
ఇక సుధీర్‌ గురించి మాట్లాడుతూ..'యూత్‌ ఐకాన్‌ సుధీర్‌. అలాంటి కుర్రాళ్లతో కలిసి పని చేస్తే మాక్కుడా కొత్త ఆలోచనలు వస్తాయి. వచ్చే తరాలకు వీళ్ల ఐడియాలు పనికొస్తాయి. ఆ కారణంగానే సుధీర్‌ని సెలెక్ట్‌ చేశాం'అని ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెచ్చిపోయిన యాంకర్ విష్ణుప్రియ.. మతిపోగొట్టే అందాలతో..?