తండ్రి పాత్రలు పోషిస్తున్న సీనియర్ నరేశ్ నటించిన సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఇటీవలే విడుదలైంది. ఇందులో కూతురు ప్రేమకు అడ్డుపడే పాత్ర. కులం, పరువు, ప్రతిష్ట అంటే పడిచచ్చేంత పాత్రను పోషించాడు. తక్కువ కులం వాడయిన సుధీర్ తన కుమార్తెను ప్రేమిస్తే తండ్రిగా అతనేం చేశాడనేది కథ. ఈ సినిమా చూశాక తన కుటుంబసభ్యులంతా ఏడ్చేశారంటూ నరేశ్ చెప్పుకొచ్చారు.
-కృష్ణ గారు ఈ మూవీ చూసి నాకు ఫోన్ చేశారు, నీ పాత్ర నాకు చూసినంతసేపు నాకు కళ్ళలో కన్నీరు తెప్పించింది, నువ్వు సుదీర్ బాబు ఈ మూవీ లో ఎక్కువ భాగం సినిమా సక్సెస్ కు తోడ్పడ్డారు, ఆరోజు కృష్ణ గారి తో పాటు మంజుల, సుదీర్ బాబు భార్య, జయ దేవ్ భార్య పద్మ ఫ్యామిలీ ఫంక్షన్ లో ఉండి అందరు ఫోన్ లో మాట్లాడారు, అందరు నాతో చాలా బాగా చేసారు అని చెప్పగానే నాకు చాలా సంతోషం గా అనిపించింది అన్నారు.
-సూపర్ స్టార్ మహేష్ ఈ మూవీ చూసి ట్విట్ చేయటం చాలా మంచి పరిణామం, మహేష్ సినిమా బాగోకపొతే అసలు ట్విట్ చేయరడు అంత పెద్ద హీరో సినిమా బావుంది అని చెప్పటం శుభ పరిణామం,
-మా సుదీర్ బాబు గురించి చెప్పాలంటే ఈ జనరేషన్ లో చాలా కష్టపడే హీరో,క్లైమాక్స్ లో సుదీర్ నా మొహం మీద ఉమ్ము ఊసే సీను లో చాలా ఇబ్బంది పడ్డాడు అప్పుడు నువ్వు ఉమ్ము ఊసేది నా క్యారెక్టర్ మీద అని చెప్పాను, అయినా కానీ సుదీర్ నా వల్ల కాదు అన్నాడు అప్పుడు సైడ్ కి పెట్టి చేయించాము, సుదీర్ కి ఈ మూవీ నటుడి గా ఒక మెట్టు పెంచుతుంది అని తెలిపారు.