Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైతు స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో లాభం- ఫస్ట్ లుక్ విడుద‌ల చేసిన బాబి

Advertiesment
రైతు స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో లాభం-  ఫస్ట్ లుక్ విడుద‌ల చేసిన బాబి
, మంగళవారం, 31 ఆగస్టు 2021 (16:32 IST)
Labham first look
విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన “లాభం” చిత్రం ఫస్ట్ లుక్ ను ప్రముఖ హిట్ చిత్రాల దర్శకుడు బాబీ చేతుల మీదుగా విడుదల చేశారు. ఆయనతో పాటు ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి వై.లు ఈ ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రం సెప్టెంబరు 9న వినాయక చవితి సందర్భంగా తమిళంతో పాటు తెలుగులోనూ ఏక కాలంలో థియేటర్లలో విడుదలవుతోంది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ చిత్రం ఫస్ట్ టైం రెండు భాషల్లోనూ విడుదల కావడం విశేషం. S P జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్నిశ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్) ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.
 
దర్శకుడు బాబీ మాట్లాడుతూ ‘విజయ్ సేతుపతి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. సైరా, ఉప్పెన చిత్రాలలో ఆయన పాత్రలకు మంచి పేరువచ్చింది. లాభం చిత్రంతోనూ ఆయన తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తారనే నమ్మకం వుంది. ఇందులో అతని పాత్ర తన గత చిత్రాల్లానే చాలా వైవిధ్యంగా వుంటుందని అనుకుంటున్నా. ఫస్ట్ లుక్ చూస్తుంటే, విజయ్ సేతుపతి లుక్ చాలా యూనిక్ గా కనిపిస్తోంది. ఇందులో రైతుల సమస్యలపై పోరాడే యువకుని పాత్రలో విజయ్ సేతుపతి  ప్రేక్షకుల్ని అలరిస్తారని నమ్మకం ఉంది. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాతలకు అభినందనలు. ఈ చిత్రం విజయం సాధించి మంచి లాభాలు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నా. ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా విడుదలవుతోంది కాబట్టి దేవుడి ఆశీస్సులు కూడా ఈ చిత్రానికి, నిర్మతలకు పుష్కలంగా వుండాలని కోరుకుంటున్నా’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్), సమర్పకుడు లాయర్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

`పాగ‌ల్` స‌క్సెస్‌తో నిర్మాత‌గా చాలా హ్యాపీగా ఉన్నాను: బెక్కెం వేణుగోపాల్‌