Rajaraja chola prerelease
హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ ఎంటర్‌టైనర్ `రాజ రాజ చోర`. మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్స్. హిసిత్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 19న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బిగ్ టికెట్‌ను ఆవిష్కరించారు డైరెక్టర్ అనిల్ రావిపూడి, నారా రోహిత్. ఇంకా ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బాబి, శ్రీవాస్, వివేక్ ఆత్రేయ, పపవన్ సాధినేని, తేజ మార్ని, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, బెజవాడ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ, కథంతా పూర్తయిన తర్వాత ఎం.ఎల్.కుమార్ చౌదరిగారికి, కీర్తిగారికి ఈ కథను చెప్పాం. కీర్తి మా ఫ్యామిలీకి చాలా క్లోజ్. ముఖ్యంగా మా పాపకు తను చాలా క్లోజ్ ఫ్రెండ్. తను నా కోసం ఓ పగిలిపోయే కథను ఇచ్చినందుకు థాంక్స్. ఈ సినిమాను టి.జి.విశ్వప్రసాద్‌గారితో, అభిషేక్ అగర్వాల్‌గారితో అసోసియేట్ అయ్యి సినిమా చేశాం. సినిమా స్టార్ట్ చేసిన 10-15 రోజులకే పాండమిక్ స్టార్ట్ అయ్యింది. తర్వాత ఆరేడు నెలలు పాటు సినిమా గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎంత డిస్కస్ చేసుకున్నా, స్టార్టింగ్‌లో ఏదైనా స్క్రిప్ట్ అనుకున్నామో దాన్నే సినిమాగా తీశాం. ఇకపై ఇంత టైమ్ తీసుకోకుండా సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాం.
వివేక్ సాగర్ అద్భుతమైన సంగీతాన్ని ఇస్తాడంటూ అందరూ అంటారు కానీ.. కష్టపడి తీసిన మా సినిమాకు తను అందించిన సంగీతాన్ని విన్న తర్వాత తన కాళ్లపై పడాలనించింది. తను నాకు గురువు. దర్శకుడు హసిత్.. బిట్స్ పిలానీ స్టూడెంట్. బిట్స్ పిలానీ పేరు వినడమే తప్ప.. అక్కడ చదువుకోవడం కాదు కదా, కనీసం స్నేహితులు కూడా లేరు. బిట్స్ పిలానీలో చదువుకుని సినిమాల్లో పనిచేయడానికి వస్తారా? అని తనను ఆశ్చర్యంగా చూస్తుండేవాడిని. తనకు ఎలాగైనా సపోర్ట్ చేయాలని తొలిరోజునే అనుకున్నాను. ఎందుకంటే నాకు అంత బాగా కనెక్ట్ అయ్యాడు. తను ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. తనతో చాలా సినిమాలు చేయాలని అనుకుంటున్నాను.
రాజరాజచోర మన తెలుగు సినిమా.. అందులో నేను యాక్ట్ చేశానని గర్వంగా చెబుతున్నాను. ఈ సినిమాను ప్రతి లాంగ్వేజ్‌లో రీమేక్ చేస్తారని ఈరోజు చెబుతున్నాను. ఈ మాటను అందరూ అండర్‌లైన్ చేసుకోండి. మనందరికీ సంబంధించిన కొత్త కథ. కథ చెప్పిన విధానం కొత్తగా ఉంటుంది. సినిమాలో ఎంత నవ్వులుంటాయో, అంతే ఎమోషన్స్ ఉంటాయి. హండ్రెడ్ పర్సెంట్ కింగ్ సైజ్ ఎక్స్‌పెరిమెంట్ మూవీ. నేను వెంకటేశ్‌గారికి వీరాభిమానిని. ఆయన నారప్ప సినిమా ఓటీటీలో విడుదలైనప్పుడు నేను రెండు రోజులు బాధపడ్డాను. కానీ థియేటర్స్ పరిస్థితి అలా ఉన్నాయి. ఇప్పుడు క్రమంగా థియేటర్స్‌కు జనాలు వస్తున్నారు. ఇప్పుడు వస్తున్న సినిమాలను ఆదరిస్తే.. కచ్చితంగా రేపు మన సూపర్‌స్టార్స్ సినిమాలన్నీ విడుదలవుతాయి. వెంకటేశ్‌గారి సినిమాను మిస్ అయిన ఆయన అభిమానుల కోసం.. ఆయన అభిమానిగా, ఓ చిన్నసైజ్ వెంకటేశ్‌గా నేను ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా `రాజరాజచోర`ను మీ కోసం అందిస్తున్నాను. అందరి హీరోల అభిమానులు మా చిన్న సినిమాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఆదరిస్తే కచ్చితంగా ఏం సినిమారా అని గ్యారంటీగా చెప్పుకుంటారు. ఓటీటీ నుంచి ఆఫర్స్ వచ్చినా.. కచ్చితంగా సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేయాలనుకున్ననిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ, నేటి తరం కుర్ర దర్శకులు డిఫరెంట్ జోనర్ నవ్వించే కథలతో మన ముందుకు వస్తున్నారు. హీరోయిన్స్ మేఘా ఆకాశ్, సునైనలకు ఆల్ ది బెస్ట్. ఇక హీరో శ్రీవిష్ణు గురించి చెప్పాలంటే.. తనంటే నాకు చాలా ఇష్టం. తన సినిమాలు అప్పట్లో ఒకడుండేవాడు నుంచి ఏదో రకంగా భాగమవుతూనే ఉన్నాను. తను స్టోరి సెలక్షన్ అంత బావుంటుంది. ఎవరైనా లైవ్లీ స్టోరి రాసుకుని, ఎవరికి చెప్పాలనుకున్నప్పుడు ముందుగా వినిపించే పేరు శ్రీవిష్ణు. జయాపజయాలను పట్టించుకోకుండా డిఫరెంట్ సినిమాలను ట్రై చేస్తుంటాడు. `రాజరాజచోర` తన కెరీర్‌లో బెస్ట్ ఫిలిం కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర దర్శకుడు హసిత్ గోలి మాట్లాడుతూ ``ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల్లోకి వచ్చినప్పుడు నా తల్లిదండ్రులు ఇచ్చిన సపోర్ట్ గురించి మాటల్లో చెప్పలేను. అంత ధైర్యం ఇచ్చి నన్ను ముందుకు నడిపినందుకు వారికి కృతజ్ఞతలు. తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వివేక్ ఆత్రేయ, శ్రీవిష్ణు ఇచ్చిన సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు శ్రీవిష్ణు అంటే చాలా అభిమానం. చదువుకునే సమయం నుంచి తన సినిమాలను ఇష్టపడ్డాను. ఇప్పటి వరకు తను చేసిన సినిమాల్లో కనిపించిన కొంటె విష్ణు కన్నా, పదిరెట్లు ఎక్కువగా కనిపిస్తాడు. అందరూ కథకు లోబడే సినిమాను చేశాం. ప్రేక్షకులు తగు జాగ్రత్తలు తీసుకుని సినిమా చూడాలని కోరుకుంటున్నాను. సినిమా తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తుంది`` అన్నారు.
నారా రోహిత్ మాట్లాడుతూ, విష్ణుకి ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. సినిమాను ఇంత బాగా తీసిన డైరెక్టర్ హసిత్‌కి థాంక్స్. సినిమాను బాగా ఎంజాయ్ చేశాను. వివేక్ సాగర్ ఈ సినిమాకు ప్రధాన బలం. అద్భుతమైన సంగీతాన్ని, బ్యాగ్రౌండ్ స్కోర్‌ను ఇచ్చాడు` అన్నారు. ఇంకా డైరెక్టర్ బాబీ, డైరెక్టర్ శ్రీవాస్, వివేక్ ఆత్రేయ, మేఘా ఆకాశ్, సునైన, మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ తదితరులు మాట్లాడారు.