Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచు విష్ణు "కన్నప్ప"కి విమర్శల పరంపర - లిరికల్ సాంగ్ రిలీజ్‌తో చెలరేగిన దుమారం!!

ఠాగూర్
మంగళవారం, 11 మార్చి 2025 (12:39 IST)
డాక్టర్ మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తూ రూపొందుతున్న చిత్రం "కన్నప్ప". ఈ చిత్రం ఆది నుంచి విమర్శల్లో చిక్కుకుంటుంది. తాజాగా ఆ చిత్రం నుంచి ఓ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. కోయ నేపథ్యానికి సంబంధం లేని సాహిత్యంతో ఈ పాటను రూపొందించారు. అలాగే, యాసకు దూరంగా ఈ పాట సాగింది. దీంతో ఈ పాటపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
వచ్చే నెల 25వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. 'కన్నప్ప' చరిత్రను ఫారిన్‌ లొకేషన్స్‌లో చిత్రీకరించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ చిత్రం విమర్శల్లో చిక్కుకుంది. ఒక కోయగూడానికి చెందిన మొరటు వ్యక్తిని యుద్ధ వీరుడిగా చూపించడం, శివుడుకి మీసాలు లేకపోవడం, ప్రభాస్ లుక్ అయోమయంగా అనిపించడం చాలా మందిని తీవ్ర అసంతృప్తికి లోనుచేసింది. 
 
ఈ పరిస్థితుల్లో ఇటీవల రిలీజ్ చేసిన 'శివశివశంకర...' పాటలో 'కన్నప్ప' తనకి అందుబాటులో ఎలాంటి పాత్ర లేకపోవడం వల్ల నోట్లో నీళ్లు పోసుకుని శివలింగాన్ని అభిషేకిస్తాడు. ఆ తర్వాత షాట్‌లోనే మట్టిపాత్రలో దుప్పి మాంసం నైవేద్యం పెట్టినట్టు చూపించడం ప్రతి ఒక్కరిని విస్మయానికి గురిచేసింది. ఇక తాజాగా 'కన్నప్ప' నుంచి "సగమై.. చెరిసగమై..." అంటూ సాగే మరో లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. మొదటి పాట మాదిరిగానే ఈ పాట కూడా విమర్శల నుంచి తప్పించుకోలేకపోయింది. 
 
కోయగూడానికి చెందిన భార్యాభర్తలు ఆ యాసలోనే పాటలు పాడుతుంటారు. గతంలో వచ్చిన "భక్త కన్నప్ప"లోని పాటలు ఇప్పటికీ నిలిచిపోవడానికి కారణం ఆ సహజత్వమే. కానీ ఈ పాటలో 'కన్నప్ప' పాత్రకి ''ఇరు పెదవుల శబ్దం - విరి ముద్దుల యుద్ధం'' అనే ప్రయోగం చేశారు. ఇది సాధారణ యువతీ యువకులు పాడుకునే పాట మాదిరిగానే ఉందిగానీ, కోయగూడానికి చెందిన ఆలుమగలు పాడుకునే పాటలా లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ పాటలో హీరోయిన్ పెదవులపై హీరో ముద్దు పెట్టేందుకు ప్రయత్నించడం కొసమెరుపు. 
 
కాగా, బాలీవుడ్ దర్శకుడు ముకేష్ కుమార్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కన్నప్పగా మంచు విష్ణు, శివుడుగా అక్షయ్ కుమార్, రుద్రుడుగా ప్రభాస్, పార్వతీ మాతగా కాజల్ నటిస్తున్నారు. సగమై.. చెరిసగమై పాటను విష్ణు, ప్రీతి ముకుందన్‌‍లపై చిత్రీకరించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఔరంగజేబు సమాధానిని కూల్చివేయాలన్న బీజేపీ ఎంపీ.. మద్దతు తెలిపిన మహా సీఎం!!

Amrutha’s Son: అమృత - ప్రణయ్‌ దంపతుల ముద్దుల కుమారుడు.. వీడియోలు వైరల్

Amaravati: అమరావతి నిర్మాణానికి రుణాలు.. కేంద్రం కీలక ప్రకటన

కాల్ చేసిన 15 నిమిషాల్లోనే క్యాబ్ అంబులెన్స్... టోల్ ఫ్రీ నంబరు 1800 102 1298

సూర్యాపేటలో హత్య కేసు... ప్రణయ్ కేసులా భర్త హంతకులకు ఇలాంటి శిక్షలు విధించాలి: భార్గవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

తర్వాతి కథనం
Show comments