Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ సాహోలో ఆర్ట్‌ను కాపీ కొట్టారు.. లీసారే ఫైర్

Webdunia
శనివారం, 31 ఆగస్టు 2019 (13:10 IST)
ప్రభాస్ సాహో భారతీయ సినిమాల్లో వందకోట్ల గ్రాస్ సాధించిన రెండో సినిమాగా నిలిచింది. తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సాహో రిలీజ్ చేశారు. రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ అన్ని కేంద్రాల్లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. బాహుబలి చిత్రంతో ప్రభాస్ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. కానీ ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.
 
ఓవర్సీస్ ప్రీమియర్‌లో 9,15,224 డాలర్లు వసూళ్లు రాబట్టడంతో బయ్యర్లు షాక్ అయ్యారు. ఇక వసూళ్ల పరంగా చూస్తే అమెరికాలో సాహో ఆరో స్థానంలో నిలిచింది. మహేశ్ బాబు నటించిన 'స్పైడర్' వంటి భారీ డిజాస్టర్ కూడా అమెరికా ప్రీమియర్‌లో 1.00 మిలియన్ డాలర్లు రాబట్టగా, పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' 1.52 మిలియన్ డాలర్లు సాధించింది. 
 
అంతేగాకుండా ఈ మూవీ దర్శక, నిర్మాతలపై లీసా రే తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇంత పెట్టుబడి పెట్టి.. గ్రాండ్‌గా రిలీజ్ చేసిన 'సాహో' కాపీ కొట్టే విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ ఫైర్ అయ్యింది. సమకాలీన చిత్రకారిణి షిలో శివ్ సులేమాన్ ఆర్ట్‌ను వారి పోస్టర్లలో కాపీ కొట్టారని ఆరోపించింది. 
 
అంతే కాదు దానికి సంబంధించిన ఒరిజినల్ ఆర్ట్ వర్క్ తో పాటు ప్రభాస్, శ్రద్ధా కపూర్‌లు ఉన్న పోస్టర్‌ను షేర్ చేసింది. అయితే ఇంత రిచ్‌గా తీసిన మూవీలో ఇలాంటి సీన్ కోసం ఆ ఆర్ట్ వాడటం తప్పుకాదు. కనీసం షిలోను సంప్రదించలేదు. 
 
కాపీ కొట్టడం సరికాదనే విషయం మూవీ మేకర్స్‌కు తెలియాలని మండిపడింది. ఇదంతా ఇతరుల సృజనాత్మకతను చోరీ చేయడమేనని లీసా రే చెప్పుకొచ్చింది. అనుమతి తీసుకుని వాడుకోవాలని.. ఆమెకు క్రెడిట్ ఇవ్వడం కూడా చేయలేదని దర్శకుడు సుజిత్‌పై ఫైర్ అయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments