సాహోకు సెన్సార్ గ్రీన్ సిగ్నల్.. నో కట్స్... యూఏ సర్టిఫికేట్?

బుధవారం, 21 ఆగస్టు 2019 (17:59 IST)
అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సాహో సెన్సార్ పూర్తి చేసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి, కానీ నిర్మాతలు ఇంకా ధ్రువీకరించలేదు. కంటెంట్ దృష్ట్యా ఎటువంటి కట్స్ లేకుండా అయితే ఏ మార్క్, లేదా కొన్ని చెప్పిన మార్పులు చేస్తే యు/ఎ ఇస్తామని అధికారులు చెప్పినట్టుగా టాక్ ఉంది. ఒకవేళ ఏ ఇస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
ముఖ్యంగా మల్టీ ప్లెక్సుల్లో 18 లోపు వయసు పిల్లలను సాహో చూసేందుకు అనుమతించరు. దీని వలన ఖచ్చితంగా వసూళ్ల మీద దెబ్బ పడుతుంది. పైగా ఆయా యాజమాన్యాలకు కూడా లేనిపోని తలనొప్పి. అలా కాకుండా యు/ఎ ఇస్తే ఎలాంటి సమస్యా ఉండదు. అందుకే కట్స్ మ్యూట్స్ లేకుండా యు/ఎ వచ్చేలా ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.
 
రిలీజ్‌కు ఇంక కేవలం 9 రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ఇదో తీవ్రమైన అడ్డంకిగా ఉండకూడదనేది యువి ఆలోచన. దీనికి సంబంధించి స్పష్టత ఈరోజు లేదా రేపు వచ్చే అవకాశం ఉంది. సినిమా నిడివి ఇప్పటికే 2 గంటల 52 నిమిషాలు అనే టాక్ ఉంది. ఒకవేళ ఫైనల్ కట్‌లో ఏమైనా తగ్గించారేమో చూడాలి. ప్రస్తుతానికి అలాంటి సూచనలైతే కనిపించడం లేదు. 
 
అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆన్‌లైన్‌లో ఇంకా మొదలుపెట్టలేదు. శనివారం నుంచి ప్రారంభించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇన్‌సైడ్ టాక్. క్రాష్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి బుక్ మై షో లాంటి యాప్‌లు చర్యలు తీసుకుని తదనుగుణంగా అప్‌గ్రేడ్ చేస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం బిగ్ బాస్ కెప్టెన్సీ కోసం కఠినమైన పరీక్ష... అందులో గెలిచిందెవరు?