Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుకుడే గ్యాంగ్ కు గుణ‌పాఠం విష్ణుకు శుభాకాంక్ష‌లు - బండి సంజ‌య్

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (07:09 IST)
Bandi sanjay -nagababu
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు రాష్ట్ర ఎన్నిక‌ల‌ను త‌ల‌పించిన విష‌యం తెలిసిందే. దీనిపై రాజ‌కీయ నాయ‌కులు కూడా ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. మెగా ఫ్యామిలీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక్క‌రే లోక‌ల్ నాన్ లోక‌ల్ అనేది స‌మ‌స్య‌కాదుకానీ, ప్ర‌కాష్‌రాజ్ గెలుస్తాడో లేదో తెలీదు అంటూ రిప‌బ్లిక్ వేడుక‌లో వ్యాఖ్యానించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బి.జెపి. స‌పోర్ట్ తీసుకున్న విష‌యం తెలిసిందే. నిన్న `మా` ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌డానికి వ‌చ్చిన‌ప్పుడు కూడా స‌మ్య‌మ‌నంతో మాట్లాడాడు. కానీ చిరంజీవి మాత్రం ఇక్క‌డ ఏర్పాట్లు స‌రిగ్గాలేవ‌ని ప్ర‌క‌టించాడు. ఇక నాగ‌బాబు స‌రేస‌రే. ఆయ‌న తానే ఓడిపోయిన‌ట్లు పీల‌యి `మా` స‌భ్య‌త్వానికే రాజీనామా చేసేశాడు. దీనిని బ‌ట్టి మెగా ఫ్యామిలీ హ‌వా తెలుగు ప‌రిశ్ర‌మ‌లో త‌గ్గింద‌నే చెప్పాలి.
 
ఇక రాజ‌కీయనాయ‌కులు ప‌లువురు `మా`కొత్త కార్య‌వ‌ర్గానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. తల‌సానితోపాటు ప‌లువురు ట్విట్ట‌ర్‌లో తెలియ‌జేశారు. అదేవిధంగా బిజెపి ప్ర‌ముఖ నాయ‌కుడు బండి సంజ‌య్ కూడా స్పందించారు.  "మా" అధ్యక్షుడిగా గెలిచిన విష్ణు మంచుగారితో సహా ఇరు ప్యానెల్ లోని విజేతలందరికి శుభాకాంక్షలు.
 
జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన "మా" ఓటర్లకు ధన్యవాదాలు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్ కు మద్దతిచ్చిన వారికి సరైన గుణపాఠం జరిగింది అంటూ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని ఎందుకు తగ్గించామంటే.. రైల్వే బోర్డు వివరణ

సాయుధ దళాల్లో పని చేసే జంట వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య

ఐవీఎఫ్‌కి తండ్రి.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన కమలా హారిస్

అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్

చట్టం ఇకపై గుడ్డిది కాదు : న్యాయ దేవతకు కొత్త రూపు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments