Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా తమ్ముడు మాట్లాడింది నూటికి నూరు శాతం కరెక్ట్ : నాగబాబు

Advertiesment
నా తమ్ముడు మాట్లాడింది నూటికి నూరు శాతం కరెక్ట్ : నాగబాబు
, శుక్రవారం, 8 అక్టోబరు 2021 (13:27 IST)
ఇటీవల ఏపీ ప్రభుత్వంపై హీరో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన రెండో అన్న నాగబాబు గట్టిగా సమర్థించారు. ఏపీ ప్రభుత్వం తీరును ఎండగడుతూ తన తమ్ముడు మాట్లాడింది నూటికి నూరుశాతం కరెక్ట్ అంటూ వెనుకేసుకొచ్చారు. 
 
ఈ నెల 10వ తేదీన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో మెగా బ్రదర్ ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కు మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో ‘మా’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. 
 
తాజాగా పోసాని మురళీ కృష్ణ, సీవీఎల్ నర్సింహా రావు వ్యాఖ్యలపై స్పందించారు. ఇటీవల 'రిపబ్లిక్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపైనా మాట్లాడారు. తన తమ్ముడిని ఆయన వెనకేసుకొచ్చారు. 
 
మెగా ఫ్యామిలీ అంతా ఎప్పుడూ ఒకే మాటపై ఉంటుందన్నారు. కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు మినహాయిస్తే.. సినీ ఇండస్ట్రీ మేలు కోసమే పవన్ వ్యాఖ్యలు చేశారన్నారు. తమ్ముడు చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని ఆయన తేల్చి చెప్పారు. అలాగే తమ అన్నయ్య ఏం చెప్పినా చేస్తామన్నారు. పవన్ వ్యాఖ్యలకు అన్నయ్య విచారం వ్యక్తం చేశారని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారని, కానీ, అన్నయ్య ఆ మాటలను ప్రత్యక్షంగా చెప్పలేదు కదా? అని ప్రశ్నించారు.
 
ఇక, పోసాని కాంట్రవర్సీపైనా ఆయన మాట్లాడారు. పోసాని గురించి మాట్లాడి నోరు పారేసుకోలేనని అన్నారు. ప్రకాశ్ రాజ్‌కు ఓటు వేయొద్దన్న సీవీఎల్ నర్సింహారావు వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఓటేయొద్దంటూ ఎలా చెబుతారని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ప్రకాశ్ రాజ్ గెలవకూడదనుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో రాజకీయాలను తీసుకురావడం మంచిది కాదన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంత క్రీజీ ట్వీట్ ... ఈ సమాజం మగాళ్ళను ఎందుకు ప్రశ్నించదు...