Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ 'మా' ప్రతినిధికి పృథ్విరాజ్ ఫోన్... 'అతనిలో మీకు నచ్చింది ఏంటి' అంటూ...

Advertiesment
ఏపీ 'మా' ప్రతినిధికి పృథ్విరాజ్ ఫోన్... 'అతనిలో మీకు నచ్చింది ఏంటి' అంటూ...
, గురువారం, 7 అక్టోబరు 2021 (16:22 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి హీరో మంచు విష్ణు పోటీ పడుతున్నారు. ఈయన ప్యానల్ నుంచి కమెడియన్ పృథ్విరాజ్ మరో పదవికి పోటీ పడుతున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతినిధికి పృథ్విరాజ్ పోన్ చేసి మాట్లాడటం వివాదస్పదమైంది. 
 
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్‌ను ఇటీవల విశాఖకు చెందిన ఏపీ ‘మా’ సన్మానం చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల్లో మద్దతు మీకేనని ప్రకటించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా పృథ్విరాజ్ ఏపీ ‘మా’ ప్రతినిధికి ఫోన్ చేసి స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. 
 
ఈ సందర్భంగా మీడియాలో పృథ్విరాజ్ ఫోన్ కాల్ అంటూ ఓ ఆడియో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఈ ఫోన్ కాల్‌‌లోని సంభాషణలను పరిశీలిస్తే, 'ప్రకాష్ రాజ్‌కు సన్మానం చేయడం బాధనిపించింది. ఇండస్ట్రీలో 30 ఏళ్ల నుంచి ఉంటున్నాం. నాకు ఆర్టిస్టులంతా తెలుసు. అందరితో నాకు మంచి రిలేషన్ ఉంది. పాతికేళ్లుగా ఓటు వేయని వ్యక్తి ప్రకాష్ రాజ్. కోవిడ్ సమయంలో మేము ఇంటింటికి తిరిగి సేవలు చేశాం. బాధితులకు బెడ్‌లు ఇప్పించాం. ఇన్ని సేవలు చేస్తే తెలుగువాడు అధ్యక్షుడిగా వద్దా? అతడికి సన్మానం చేయడమే కాకుండా.. వీడియోల్లో ‘విష్ణు ఎవడు’ అని థంబ్ ఫొటో పెట్టించారు' అని పేర్కొన్నారు. 
 
'పక్కోళ్లు మనల్ని తొక్కుతున్నా కూడా మన నవ్వుతున్నాం. అందుకే మనం డెవలప్ కావడం లేదు. మళ్లీ మనం కలుసుకోవాలి. షూటింగులు చేసుకోవాలి. విశాఖలో నాకు చాలామంది తెలుసు. అతడిలో ఏం చూసి మీరు మా మద్దతు మీకే ఉందని చెబుతారు? మూవీ రెండు సస్పెండ్ చేశారు. 
 
కన్నడ సినిమాలో నేను లేడీ గెటప్ వేస్తే విగ్గు లాగేసి.. కన్నడవాళ్లే నటించాలి అన్నారు. దీంతో నేను సిగ్గుతో వచ్చేశాను. భారతదేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. కానీ, మన మీద పోటీ చేయకూడదు. అతడు మీకు అంతగా నచ్చాడా. మధ్యలో సన్మానం చేయడం నచ్చలేదు. మేం కూడా వైజాగ్‌కు షూటింగ్‌కు వస్తాం' అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

30 ఇయర్స్ బత్తాయి బెదిరింపులు.. ఎక్కడంటే..?