Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్ తరుణ్ , సందీప్ మాధవ్ స్నేహితులుగా - మాస్ మహారాజు ప్రారంభం

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (06:42 IST)
Raj Tarun, Sandeep Madhav, CH Sudhir Raju, M Asif Jani, Simrat, Sampada
రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ , సిమ్రత్, సంపద హీరో,హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం `మాస్ మహారాజు`. సి.హెచ్.సుధీర్ రాజు దర్శకత్వంలో ఎం.అసిఫ్ జానీ నిర్మిస్తున్న నూతన ఈ చిత్రం పూజ కార్యక్రమాలు హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో సినీ అతిథుల సమక్షంలో ఘనంగా జరుపు కుంది. ఈ కార్యక్రమానికి నిర్మాత సి.కళ్యాణ్, జెమిని కిరణ్, దర్శకుడు వీరశంకర్, నిర్మాత బెక్కం వేణుగోపాల్, నాంది డైరెక్టర్ సతీష్ కనక మేడల ముఖ్య అతిథులుగా విచ్చెశారు. ఈ చిత్రం తొలి ముహూర్తపు సన్ని వేశానికి హీరో, హీరోయిన్ లపై దర్శకుడు వీరశంకర్ క్లాప్ నివ్వగా, జెమిఙ్ కిరణ్ స్విచ్ఛాన్ చేయగా నిర్మాత సి.కళ్యాణ్ గౌరవ దర్శకత్వం వహించారు.
 
అనంతరం చిత్ర దర్శకుడు సి.హెచ్.సుధీర్ రాజు మాట్లాడుతూ, స్టార్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఆషిఫ్ జానీ ప్రొడ్యూసర్ గా "మాస్ మహారాజు" చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మనకు సూర్యచంద్రులు ఒకరి కోసం ఒకరు ఎలా వస్తూ వెళ్తున్నారో ఈ సినిమాలో వీరిద్దరూ ఒకరి కోసం, ఒకరు ఏం త్యాగం చేశారన్నదే కథ. ఫ్రెండ్షిప్ కోసం తీస్తున్న ఈ సినిమాను ఫ్రెండ్స్ ఎవరు చూసినా మా ఇద్దరి జీవితాల్లో ఇటువంటి కథ జరిగిందని అనుకునేలా సినిమా ఉంటుంది. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ  సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు. 
 
Clap by veerasankar
చిత్ర నిర్మాత ఎమ్.అసిఫ్ జానీ మాట్లాడుతూ, మొట్ట మొదటిగా నేను తీస్తున్న ఈ సినిమాకు అందరూ వచ్చి బ్లెస్స్ చేసినందుకు మా ధన్యవాదాలు. నేను సినిమా మొదలు పెట్టినప్పుడు నాకు ఎలా చేయాలో అర్థం కాలేదు.  రాజా రవీంద్ర గారు కలసి మాకు సపోర్ట్ చేస్తూ ధైర్యం చెప్పడంతో ఈ రోజు సినిమా గ్రాండ్ లాంచ్ చేయడం జరిగింది. మేము తీస్తున్న ఈ సినిమా అందరినీ తప్పకుండా ఎంటర్టైన్మెంట్ చేస్తుందని అన్నారు.
 
హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ,  వంగవీటి, జార్జిరెడ్డి తర్వాత మంచి పవర్ ఫుల్ కథ చెప్పిన డైరెక్టర్ సుధీర్ వర్మ గారికి నా ధన్యవాదాలు. ఈ సినిమా కథ చాలా అద్భుతంగా ఉంది. అజయ్ విన్సెంట్ కెమెరామెన్ గా, మణి శర్మ గారు సంగీత దర్శకుడుగా ఈ సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. అందరు ప్రేక్షకులను ఈ సినిమా ఆలరిస్తుంది. మంచి టైమింగ్ తో ఒక యాక్షన్ ప్యాక్డ్ ఫ్రెండ్షిప్ లో వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
 
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ,  దర్శకుడు సుధీర్ ఈ కథ చెప్పగానే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. నిర్మాత ఈ చిత్రాన్ని ఎంతో ప్యాషన్తో తీస్తున్నారు.ఈ సినిమా గురించి నిర్మాత కలిసినప్పుడు ఇందులో సందీప్ కూడా నటిస్తున్నాడు అని చెప్పగానే సినిమా చాలా బాగుంటుందని సినిమాపై నమ్మకం వచ్చింది. సినిమాను త్వరలో షూటింగ్ మొదలు పెట్టి రెండు షెడ్యూల్లో సినిమాను పూర్తి చేసి త్వరగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. 
 
హీరోయిన్ సిమ్రత్ కౌర్ మాట్లాడుతూ* ..ఈ సినిమాలో నాకు చాలా మంచి పాత్ర ఇచ్చారు.ఇంత మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. 
 
హీరోయిన్ సంపద మాట్లాడుతూ, తెలుగులో వస్తున్న నా మొదటి సినిమా ఇది. రాజ్ తరుణ్, సందీప్ వంటి సీనియర్ల దగ్గర వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. 
 
 నటుడు రాజా రవీంద్ర మాట్లాడుతూ, దర్శకుడు సుధీర్ రాజు చెప్పిన "మాస్ మహారాజు" కథ బాగా నచ్చింది. ఈ మధ్య కాలంలో ఇటువంటి కథ వినలేదు. చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ చిత్ర నిర్మాత చాలా చిన్న వయసులో వ్యాపారంలో సక్సెస్ అయ్యి ఇప్పుడు ఈ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా కూడా సక్సెస్ అయితే ఇలాంటి సినిమాలు చాలా వస్తాయి. కొత్తనటులను ఎంకరేజ్ చేసే ఇలాంటి మంచి ప్రొడ్యూసర్లు కి మనమందరం సపోర్ట్ చేయాలి. రాజ్ తరుణ్, సందీప్ ల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఈ కథ చాలా వెరైటీగా ఉంది. మంచి ఐడియాతో వస్తున్న ఈసినిమా తప్పకుండా నచ్చుతుందని అన్నారు.
 
ఫైట్ మాస్టర్ జోషువా మాట్లాడుతూ, సుధీర్ గారు నాకు ఈ కథ కొత్తగా చెప్పాడు కొత్త యాక్షన్ తో, సినిమాను కొత్త గా డిజైన్ చేశాడు.ఈసారి యాక్టిన్ సీన్స్  కొత్తగా ఉండేలా మేము ప్రయత్నం చేస్తున్నాం.ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందని మీరు చూస్తారని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎంఎస్ కోసం చికాగో వెళ్లాడు.. పెట్రోల్ బంకులో పార్ట్‌టైమ్ చేశాడు.. కానీ..?

'ఫెంగాల్' : దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమల్లో భారీ వర్షాలు

హైడ్రాకు త్వరలో ప్రత్యేక పోలీస్ స్టేషన్.. రంగనాథ్ ప్రకటన

ములుగు జిల్లాలో కాల్పులు.. ఏడుగురు మావోయిస్టులు మృతి

ఆర్ఆర్ఆర్ కస్టడీ నిజాలు.. గుండెల మీద కూర్చుని హార్ట్ ఎటాక్ వచ్చేలా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments