Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయం కోసం ఎదురు చూస్తున్న సీనియర్ నటి జయకుమారి

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (08:35 IST)
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించిన అలనాటి మేటి నటి జయకుమారి ఇపుడు ఇతరుల సాయం ఎదురు చూస్తున్నారు. అనారోగ్య సమస్యలతో పాటు రెండు కిడ్నీలు పాడైపోవడంతో ఆమె చెన్నై కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కానీ, వారు ఆమె బాగోగులు పట్టించుకోవడం లేదు. దీంతో ఇతరల సాయం కోసం ఆమె ఎదురు చూస్తున్నారు. 
 
చెన్నై, వేళచ్చేరిలోని ఓ అద్దె ఇంటిలో నివసిస్తూ వచ్చిన జయకుమారి అనారోగ్యానికి గురికావడంతో చెన్నై నంగనల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ వచ్చారు. అక్కడ ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో రెండు కిడ్నీలు పాడైపోయినట్టు తేలింది. దీంతో ఆమెకు మరింత మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు వీలుగా ఆమెను కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ కూడా వైద్యం కోసం అయ్యే ఖర్చుల కోసం ఇతరుల నుంచి సాయం ఎదురు చూస్తున్నారు. 
 
ఈమె గత 1966లో తమిళ సూపర్ స్టార్ డాక్టర్ ఎంజీ.రామచంద్రన్ నటించిన "నాడోడి" చిత్రంలో విలన్‌గా నటించిన సుప్రసిద్ధ నటుడు నంబియార్‌‌కు అంధురాలైన చెల్లి పాత్రను పోషించి వెండితెరకు తొలిసారి పరిచయమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్రూం వెళ్లాలని చెప్పి - డబ్బు - నగలతో ఉడాయించిన వధువు... ఎక్కడ?

సంక్రాంతి రద్దీ : 52 అదనపు ప్రత్యేక రైళ్ళను ప్రకటించిన ద.మ.రైల్వే

19 ఏళ్ల యువకుడితో 32 ఏళ్ల భార్య అర్థరాత్రి రాసలీల చూసి హత్య చేసిన భర్త

వీడు సామాన్యుడు కాదు.. అసాధ్యుడు.. నాలుకతో ఫ్యాన్ రెక్కలను...

కేసీఆర్ ఫ్యామిలీ వెయ్యేళ్లు జైలుశిక్ష అనుభవించాలి : సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments